2010 నుండి ఇప్పటివరకు వచ్చిన సూపర్ హీరోయిన్స్.. 2010 నుండి 2020 వరుకు చాల మార్పులు జరిగాయి.. ఎన్నో సినిమాలు వచ్చాయి.. కానీ కొన్నే మనసును తాకాయి.. కొందరే మన టాలీవుడ్ ప్రేక్షకుల మనసు దోచిన హీరోయిన్స్ అయ్యారు.. ఒక్క సినిమాతో సూపర్ హిట్ కొట్టి కంటిన్యూ అయి టాప్ హీరోయిన్స్ గా ఎదిగిన వారు ఎవరో మనం ఇక్కడ చూద్దాం.. 

 

సమంత.. 

 

గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నాగ చైతన్య సరసన నటించి నిజంగానే మాయ చేసింది.. 

 

రిచా గంగోపాధ్య.. 

 

చేసింది కొన్ని సినిమాలే.. సినిమాలకు గుడ్ బై చెప్పేసి చదువుకోడానికి వెళ్ళింది.. కానీ ఆమె నటించిన లీడర్ లో.. మిర్చిలో భలే అందంగా ఉండేది. 

 

తాప్సి.. 

 

అస్సలు ఈ అమ్మాయికి యాక్టింగ్ వచ్చా అనే ప్రశ్న నుండి మోస్ట్ బ్యూటిఫుల్ సూపర్ హీరోయిన్ గా ఎదిగింది.. మొదట టాలీవుడ్ లో అడుగు పెట్టిన బాలీవుడ్ లో సెటిల్ అయిపోయింది. 

 

శృతి హాసన్.. 

 

ఫస్ట్ లో ఐరన్ లెగ్ అన్నారు.. కానీ తరువాత సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా మారింది.. ఇంకా ఈ హీరోయిన్ మల్టి టాలెంటెడ్ కూడా. 

 

నిత్యామీనన్.. 

 

అద్భుత నటి.. అంతే కాదు మల్టి టాలెంటెడ్.. మంచి నటి.. మంచి సింగర్ కూడా. 

 

రెజినా.. 

 

మంచి నటి.. కానీ మంచి సినిమాలు పడలేదు.. ఈ మధ్యే ఎవరు సినిమాలో మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. 

 

లావణ్య త్రిపాఠి.. 

 

పెద్దగా హిట్ రేట్ లేదు కానీ.. ఈమె ఫస్ట్ సినిమాలో.. అదే అండి అందాల రక్షేసి లో ఈమెని చూసి ఎంతమంది ఫాన్స్ అయిపోయారో.. 

 

క్యాథెరిన్.. 

 

గ్లామర్ రోల్స్ కి కేర్ అఫ్ అడ్రెస్స్ ఈ మలయాళీ పాప... చేసిన అన్ని సినిమాల్లో గ్లామర్ రోల్స్ లోనే నటించింది.

 

ఈషా రెబ్బ.. 

 

మన తెలుగు అమ్మాయి.. మంచి నటి.. ఈమె అందాన్ని అ! సినిమాలో చూస్తే ఫాన్స్ అయిపోతారు అంతే.. 

 

రకుల్ ప్రీత్.. 

 

వేంకటాద్రి ఎక్సప్రెస్ అంటూ చిన్న సినిమాతో ఎంట్రీ ఇచ్చిన మహేష్, చరణ్, ఎన్టీఆర్ లాంటి పెద్ద పెద్ద హీరోస్ పక్కన నటించి స్టార్ హీరోయిన్ అయిపోయింది. 

 

రాశి ఖన్నా.. 

 

నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించిన రాశి ఖన్నా ఆతరవాత మళ్లీ అలాంటి సినిమాల్లో నటించలేదు. 

 

పూజ హెగ్డే... 

 

ఫస్ట్ సినిమా ప్లాప్ అయినప్పటికీ ఇప్పుడు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా సెటిల్ అయ్యింది. 

 

రీతూ వర్మ.. 


అందంతో పాటు అభినయం ఉన్న మన తెలుగు అమ్మాయి రీతూ వర్మ. పెళ్లి చూపులులో సూపర్ అనిపించింది ఈ భామ. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: