మహానటి సావిత్రి... ఈ పేరు వింటే చాలు చాలా మంది అదో హుషారు. ఆమె నటన ఆమె అందం ఆమె మాట తీరు, ఆమె చేసిన సినిమాలు, ఆమె నటించిన కీలక పాత్రలు ఇలా ఎన్నో చెప్పుకోవచ్చు. ఆమె ప్రతీ పాత్రలో జీవించారు. ప్రతీ సన్నివేశంలో ఆమె ఎలా ఉన్నారో కొందరు ప్రేక్షకులకు ఇప్పటికి గుర్తుండే ఉంటుంది అనేది వాస్తవం. సావిత్రి అనగానే సినిమా సినిమా అనగానే సావిత్రి. తెలుగు తెర మీద అయినా తమిళ తెర మీద అయినా సరే అంత అందంగా ఉండే హీరోయిన్ మరొకరు ఉండరు అని అప్పుడు అయినా ఇప్పుడు అయినా అనుకుంటూ ఉంటారు. 

 

ఆమె సినిమాలో ఉందీ అంటే ఆమె సినిమాకు ఒక అందం ఒక ఆస్తి అనేది చాలా మంది చెప్పే మాట. తెలుగులో అయినా మరో భాషలో అయనా సరే సావిత్రి నటిస్తున్నారు అనగానే ప్రేక్షకులు క్యూ కట్టే వారు. జీవితంలో ఆమె సాధించిన విజయాల గురించి ఎంత చెప్పినా తక్కువే. మాయా బజార్ సినిమాలో ఆమె అందం చూసిన ప్రేక్షకులు మా ఇంట్లో అమ్మాయి అనుకున్నారు. ఆ విధంగా సావిత్రి తన అందంతో అభిమానులు మెప్పించి సినీ తెర మీద అల నిలబడ్డారు అనేది వాస్తవం. ఒకప్పుడు సావిత్రి లేని సినిమా అనేది చూడటానికి కూడా ఉండేది కాదు. 

 

ఆమె పక్కన నటిస్తే హీరోకి ఒక రేంజ్ ఉంటుంది అనే భావన లో చాలా మంది ఉండేవారు. ఆమె దర్శకత్వం చేసినా సరే అంతే. సావిత్రి పక్కన నటించడం అనేది చాలా మంది అప్పట్లో ఒక గుర్తింపు గా చూసే వారని చెప్తూ ఉంటారు. మన తెలుగులో ఎన్నాళ్ళు అయినా సరే సావిత్రి స్థానం ఎవరూ భర్తీ చేయలేనిది. ఆమె అందం అయినా ఆమె సినిమాలు అయినా సరే.

మరింత సమాచారం తెలుసుకోండి: