శ్రీదేవి... చాలా మందికి ఒకప్పుడు ఈ పేరు ఒక ఊపు. ఈమెను తెర మీద చూస్తే చాలు పండగ చేసుకునే వారు కూడా అప్పట్లో ఉండే వారు అనేది వాస్తవం. ఏ హీరో తో శ్రీదేవి సినిమా అయినా సరే బ్లాక్ అండ్ వైట్ అయినా ఈస్ట్ మాన్ కలర్ అయినా సరే శ్రీదేవి అందం చూడటానికే ప్రేక్షకులు వెళ్ళే వారు అనేది వాస్తవం. ఆ విధంగా ఆమె తన నటన తో ప్రేక్షకులను మెప్పించారు. హీరోలు కూడా ఆమెను చూడటానికి షూటింగ్ స్పాట్ లో ఎక్కువగా ఇష్టపడే వారు అని చెప్తూ ఉంటారు. ఆమెను పెళ్లి చేసుకోవాలని చాలా మంది హీరోలు కలలు  కన్నా సందర్భాలు కూడా ఉన్నాయట. 

 

ఆమె సినిమాలో నటిస్తే చాలు అనుకుని అగ్ర హీరోలు తెలుగు అయినా తమిళం అయినా హింది అయినా సరే అనుకునే వారు అని చెప్తూ ఉంటారు. ఆ విధంగా ఆమె తన ముద్ర వేసుకున్నారు అనేది వాస్తవం. శ్రీదేవి అందం కోసం ప్రత్యేక పాటలు రాసారు రచయితలు అంటే ఆమె ఏ స్థాయిలో ఆకట్టుకున్నారు తన అందం తో అనేది అర్ధం చేసుకోవచ్చు. శ్రీదేవి నవ్వితే చాలు అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. శ్రీదేవి అమాయకత్వం శ్రీదేవి నటన శ్రీదేవి మాట ఇలా ప్రతీ ఒక్కటి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు అనే విధంగా ఆమె మెప్పించారు అనేది వాస్తవం. 

 

శ్రీదేవి సినిమాల్లో ఎక్కువగా హైలెట్ అయ్యేది ఆమె సొట్ట బుగ్గలు ఆమె నవ్వు. ముత్యాలు రాలుతున్నట్టు ఉండేది ఆమె నవ్వు అని ప్రేక్షకులు చెప్పుకునే వారు అంటే ఆమె ఏ స్థాయిలో తన అందంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు అనేది అర్ధం చేసుకోవచ్చు. నేడు శ్రీదేవి లేకపోవచ్చు గాని ఆమె పాత్రలు ఆమె అందం మాత్రం ప్రేక్షకులకు అలా ఉండిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: