సినిమాల్లో హీరోకు ఉన్నంత లాంగ్ కెరీర్ హీరోయిన్లకు ఉండటం కష్టం. కానీ కొంతమంది తమ అందంతో, నటనతో, ఫిట్ నెస్ తో చాలా ఏళ్లపాటు కెరీర్ కొనసాగిస్తారు. అంతటి లాంగ్ కెరీర్ కొనసాగిస్తున్ హీరోయిన్లలో సమంతకు ప్రత్యేక ప్లేస్ ఉంది. తొలి సినిమా ‘ఏ మాయ చేసావే’తోనే భారీ హిట్ సాధించి ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ అయిపోయింది. సమంత పదేళ్లుగా తన కెరీర్ ను అప్రతిహతంగా కొనసాగిస్తోంది. ఆ సినిమాతో తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోలందరితో నటించి పర్ఫెక్ట్ జోడీ అనిపించుకుంది.

 

 

సమంత కెరీర్ ప్రత్యేకత ఏంటంటే.. ఆమె కెరీర్లో ఫ్లాపుల గురించి వెతుక్కోవాల్సిందే. అన్ని హిట్లు అమ్మడి ఖాతాలో ఉన్నాయి. హీరోలకు గోల్డెన్ లెగ్ గా సమంతకు పేరు ఉంది. పవన్ కల్యాణ్, రామ్ చరణ్ఇండస్ట్రీ హిట్స్.. అత్తారింటికి దారేది, రంగస్థలం సినిమాల్లో సమంతనే హీరోయిన్. కెరీర్ పీక్స్ లో ఉండగానే అక్కినేని హీరో నాగ చైతన్యతో ప్రేమ కొనసాగించింది. 2017లో పెళ్లి చేసుకుంది. పెళ్లయిన హీరోయన్లకు కెరీర్ కష్టమని భావించే ఆలోచన తప్పని నిరూపించి రంగస్థలంలో నటించింది. ఆ సినిమా ఇండస్ట్రీ హిట్ అయింది. మహేశ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ లతో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల్లో నటించింది.

 

 

సమంత అందానికి, నటనకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. గ్లామర్ తోపాటు నటనను కూడా సమపాళ్లలో చేయగల సత్తా సమంత సొంతం. గత ఏడాది వచ్చిన ఓ బేబీ సినిమాలో సమంత నటనలో పరిణితి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. పెళ్లయ్యాక నాగ చైతన్యతో జోడీగా నటించిన మజిలీ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. పెళ్లయ్యాక ఇలా వరుస హిట్లు సాధించిన హీరోయిన్ ఈ జనరేషన్ లో సమంత మాత్రమే అనడంలో సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: