కోలీవుడ్ ఇళయదళపతి విజయ్‌ హీరోగా ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న చిత్రం ‘తుపాకి’. 2012లో రిలీజైన ఈ సినిమాలో టాలీవుడ్ చందమామ కాజల్‌ కథానాయికగా నటించింది. అయితే మళ్లీ ఏఆర్‌ మురుగదాస్‌, విజయ్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనున్నట్లు ఇటీవల వార్తలు వినిపించాయి. అది 'తుపాకి' సినిమాకి సీక్వెల్ ‘తుపాకి- 2’ అని కోలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. తాజాగా సినిమాటోగ్రాఫర్‌ సంతోష్‌ శివన్‌ చేసిన సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్ట్ తో ఆ వార్తలు నిజమేనని నెటిజన్లు భావిస్తున్నారు. వాస్తవానికి మురుగదాస్‌, విజయ్‌ కాంబినేషన్‌లోని తదుపరి చిత్రానికి సంతోష్‌ శివన్‌ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నట్లు ఇప్పటికే వార్తలొచ్చాయి. అంతేకాకుండా ఈ సినిమాలో కూడా కాజల్ హీరోయిన్ గా కొనసాగనుందని గత కొన్ని రోజులుగా న్యూస్ స్ప్రెడ్ అవుతూ వస్తోంది. ఐతే ఇప్పుడు ఈ సినిమాకి సంభందించి మరో న్యూస్ చెన్నై వీధుల్లో షికారు చేస్తోంది. ఆ న్యూస్ ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ కి సంభందించింది.

 

‘తుపాకి’ సినిమాకి హరీష్ జైరాజ్ అద్భుతమైన సంగీతాన్ని అందించాడు. కానీ ఈ చిత్రానికి కొనసాగింపు 'తుపాకీ - 2' లో మాత్రం అతన్ని కొనసాగించడం లేదని సమాచారం. ఈ సినిమాకి సంగీత బాధ్యతలు మ్యూజిక్ సెన్సేషన్ థమన్ కి దక్కినట్లు సమాచారం. ఈ ఏడాది ప్రారంభంలో థమన్ మ్యూజిక్ డైరెక్షన్ లోని 'అల వైకుంఠపురంలో' పాటలు సినిమాకే హైలెట్ గా నిలిచాయి. ఈ చిత్ర విజయంలో పాటలే కీ రోల్ ప్లే చేసాయి. దీంతో ఇప్పుడు మురగ దాస్ థమన్ అయితే ఆ మ్యాజిక్ రిపీట్ చేసి అద్భుతమైన మ్యూజిక్ అందిస్తాడని భావిస్తున్నాడట. దీనికి సంభందించిన అధికారిక ప్రకటన రానప్పటికీ ఈ న్యూస్ కోలీవుడ్ సర్కిల్స్ లో హల్ చల్ చేస్తోంది. ప్రసుతం థమన్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ గా మారిపోయాడు. ఇప్పటికే ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కబోయే సినిమాకి కూడా థమన్ నే ఫైనలైజ్ చేసినట్లు ఫిల్మ్ నగర్ వర్గాలు అనుకుంటున్నాయి. ఇప్పుడు దళపతి 65 సినిమాకి ఛాన్స్ వచ్చిందంటే థమన్ చేతిలో భారీ ప్రాజెక్ట్ చేతిలోకి వచ్చినట్లే. మరి త్వరలోనే దళపతి 65 సినిమా పట్టాలెక్కుతుందా.. ఇది తుపాకీ కి సీక్వెల్ కథా లేదా వేరే ఏదైనా కథ.. తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: