టాలీవుడ్ లో తక్కువ కాలంలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ అనుష్క. అనుష్క అందం అనుష్క నటన అనుష్క డాన్స్ ఇలా ప్రేక్షకులను అన్నీ కూడా చాలానే ఆకట్టుకున్నాయి. చిన్న చిన్న హీరోలతో ఆమె ఎప్పుడు సినిమాలు చేయలేదు గాని అగ్ర హీరోలతో ఆమె చేసిన సినిమాలు ఆమె పోషించిన పాత్రలు అలా గుర్తుండి పోయాయి ప్రేక్షకులకు. ఆమె నటన చాలా మందిని ఆకట్టుకున్నా ఆకట్టుకోకపోయినా ఆమె అందం మాత్రం చాలా మందికి నచ్చింది అనేది వాస్తవం. అగ్ర హీరోల సినిమాల్లో ఆమె అందం చాలా హైలెట్ అయ్యేది. 

 

ప్రభాస్ సినిమాల్లో నాగార్జున సినిమాల్లో ఆమె అందం చూసిన ప్రేక్షకులు చాలా వరకు ఆమెకు అభిమానులు అయిపోయారు. బాహుబలి సినిమాలో కూడా ఆమె అందం తో అలరించారు.  ఆమె అందానికి దర్శకులు చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఏ సినిమాలో అయినా సరే ఆమెను అందం గా చూపించడానికి చాలా కష్టాలు పడుతూ ఉంటారు. ప్రస్తుతం ఆమె సోలో గా సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు కొన్ని సినిమా కార్యక్రమాలకు ఆమె హాజరవుతున్నారు. ఈ సందర్భంగా బయటకు వచ్చిన ఫోటోలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. 

 

ఇక బిల్లా సినిమాలో మిర్చి సినిమాలో ఆమె అందం ప్రేక్షకులను ఊపేసింది. బిల్లా సినిమాలో ఆమె బికినీ వేసింది. ఆ సినిమాలో ఆమె అందమే హైలెట్. సినిమా ఫ్లాప్ అయినా సరే ఆమె అందమే ఎక్కువగా హైలెట్ అయింది. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ఆమె పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉంది అని సమాచారం. ఎవరిని పెళ్లి చేసుకుంటుందా అనేది పక్కన పెడితే ఆమె పెళ్లి గురించి మాత్రం ఇప్పుడు ప్రత్యేకంగా చర్చలు జరుగుతున్నాయి అనేది వాస్తవం. ఒక దర్శకుడి కొడుకుని ఆమె వివాహం చేసుకునే అవకాశం ఉంది అని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: