కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ మలయాళ మూవీ అయిన ప్రేమమ్ ద్వారా సినీ రంగ ప్రవేశం చేసింది. తదనంతరం తెలుగులో ఆ సినిమాలో సహాయ నటిగా... ఆపై నాగ చైతన్య సరసన ప్రేమమ్ రీమేక్ లో నటించి అందరిని కట్టిపడేసింది. ఆమె అందం మొత్తం కళ్ళలోనే ఉందని చాలా మంది అభిమానులు తెగ పొగుడుతూ ఉంటారు.


వాస్తవానికి ప్రస్తుత కాలంలో తెలుగు కుర్ర హీరోయిన్లు తమ డైలాగులకు తామే సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంటున్నారు. చిత్రీకరణ సమయంలోనే తెలుగు భాషపై పట్టు సాధించి తమ ముచ్చటైన వాయిస్ లతో చాలా చక్కగా తమ క్యారెక్టర్లకు డబ్బింగ్ చెబుతున్నారు. అనుపమ పరమేశ్వరన్ కూడా తన సినిమాల్లోని తన క్యారెక్టర్ కు తానే డబ్బింగ్ చెబుతుంది. ప్రేమమ్, శతమానంభవతి, ఉన్నది ఒకటే జిందగీ, హలో గురు ప్రేమకోసమే, కోడి, రాక్షసుడు ఇలాంటి అన్ని సినిమాల్లో ఆమె తన అందచందాలతో, మెచ్చుకోదగ్గ నటనతో, ముద్దొచ్చే వాయిస్ తో తెలుగు తమిళ ప్రేక్షకులను బాగా అలరించింది.


సాంప్రదాయ వస్త్రాలలో అయినా... మోడ్రన్ స్టైల్ దుస్తుల్లో అయినా అనుపమ పరమేశ్వరన్ చాలా అందంగా కనిపిస్తుంది. తన కనులు, కను బొమ్మలు హృదయాన్ని హత్తుకునే కిల్లింగ్ స్మైల్ ఆమెను దక్షిణ భారతదేశ నటీమణులలో అత్యంత అందగత్తెగా చేశాయని చెప్పుకోవచ్చు. కేవలం ఐదు సంవత్సరాల లోనే తెలుగు తమిళ కన్నడ మలయాళం సినీ పరిశ్రమలో అగ్ర తారగా అనుపమ పరమేశ్వరన్ నిలిచింది. సోషల్ మీడియాలో కూడా ఆమెకు 50 లక్షల పైగా అభిమానులు ఉన్నారంటే ఆమె క్రేజ్ ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు. తన అభిమానుల కోసం తరచూ ఆమె తన హాట్ ఫోటోలను అప్లోడ్ చేస్తూ బాగా అలరిస్తుంది. తన ఐదేళ్ళ సినీ కెరియర్ లో ఇప్పటికే సైమా అవార్డ్స్, అప్సర అవార్డ్స్, ఫిలింఫేర్ అవార్డ్ లాంటివి ఆమెను వరించాయి. ప్రస్తుతం ఆమె ఓ తమిళ, ఓ మలయాళ సినిమాలో కథానాయికగా నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: