రమ్యకృష్ణ... ఒకప్పుడు ఈ పేరు ఒక సంచలనం. ఏ హీరో సినిమా అయినా సరే రమ్య ఉంటే చాలు అనుకునే వాళ్ళు ఉన్నారు. ఆమె నటన కోసం ప్రేక్షకులు, ఆమె అందం కోసం యూత్ చాలా ఆశగా ఎదురు చూసిన సందర్భాలు ఉన్నాయి అనేది వాస్తవం. అగ్ర హీరోల సినిమాలు అనగానే ఆమె అందమే ఎక్కువగా హైలెట్ అయ్యేది. చిన్న హీరోల సినిమాల్లో ఆమె నటన ఎక్కువగా హైలెట్ అయ్యేది. ఆమె విలన్ గా నరసింహ సినిమా చేసారు. ఆ సినిమాలో రజని కాంత్ పక్కన ఆమె చేసిన నీలాంభారి పాత్ర అలా నిలిచిపోయింది. 

 

తమిళనాడు లో అయితే ఆమె మీద పగ కూడా పెంచుకున్నారు రజని కాంత్ అభిమానులు. ఆ విధంగా ఆమె మెప్పించారు అనేది వాస్తవం. చాలా మంది హీరోల సినిమాల్లో ఆమె అందానికి చాలా ప్రాధాన్యత ఇచ్చే వారు దర్శక నిర్మాతలు. ఆమె నవ్వు ని చూపించడానికి అగ్ర దర్శకులు ఎన్నో విధాలుగా కష్టాలు పడిన సందర్భాలు కూడా ఉన్నాయి అనేది వాస్తవం. రమ్యకృష్ణ ఇప్పటికి అదే స్థాయిలో ఉన్నారు. అమ్మ అయినా సరే ఆమె అందం లో మాత్రం ఏ మార్పు కూడా రాలేదు. అగ్ర హీరోల సినిమాల్లో ఆమె ఇప్పుడు కీలక పాత్రలు చేస్తున్నారు. 

 

ఆమె నటన కోసం ప్రేక్షకులు అలా ఎదురు చూస్తూ ఉంటారు. అలాగే ఆమె అందం కూడా... అగ్ర హీరోలు వెంకటేష్, రజని కాంత్, బాలకృష్ణ, నాగార్జున, చిరంజీవి వంటి హీరోల సినిమాల్లో ఆమె నటించారు. ప్రత్యేకంగా ఫాన్స్ ని కూడా సంపాదించుకున్నారు ఆమె. ఆ విధంగా తన నటన తో అందం తో గుర్తుండిపోయారు రమ్యకృష్ణ. బాహుబలి సినిమాలో ఆమె చేసిన శివగామి పాత్ర చాలా మంది ప్రేక్షకులకు ఇంకా గుర్తు ఉంది అనేది వాస్తవం.

మరింత సమాచారం తెలుసుకోండి: