సుధ కొంగ‌ర‌లేడీ డైన‌మిక్ డైరెక్ట‌ర్‌. ద్రోహి, గురు చిత్రాల‌ను తెర‌కెక్కించిన సంగ‌తి తెలిసిందే. ప్రస్తుతం సూర్య హీరోగా ఆకాశమే నీ హద్దురా అనే చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. తమిళంతో పాటు తెలుగులో కూడా ఒకేసారి ఈ చిత్రంను విడుదల చేయబోతున్నారు. ఇక సుధ కొంగ‌ర తీసుకునే క‌థాంశాల‌న్నీ చాలా కొత్త‌గా డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో ఉంటాయి. ఉదాహ‌ర‌ణ గురు చిత్రం తీసుకుంటే చాలా వెరైటీ కాన్స‌ప్ట్ అన్నట్లే ఉంటుంది.  సమ్మర్‌లో సినిమా విడుదల చేయాల్సి ఉన్నా కూడా కరోనా కారణంగా సినిమా ఆలస్యం అవ్వనుంది. గత కొన్నాళ్లుగా సుధ తదుపరి చిత్రంపై రకరకాల వార్తలు వస్తున్నాయి. తమిళ సూపర్‌ స్టార్‌ విజయ్‌తో ఆమె తదుపరి చిత్రం ఉంటుందని.. కాదు తెలుగులో ఒక యంగ్‌ హీరోతో సుధ చర్చలు జరుపుతుందని మరికొందరు అన్నారు.

 

అయితే తాజాగా దర్శకురాలు సుధ కొంగర మాట్లాడుతూ.. ప్రస్తుతం తాను లాక్‌ డౌన్‌ కారణంగా పూర్తిగా ఇంటికే పరిమితం అయిన సంద‌ర్భంగా. నా దృష్టి మొత్తం సూర్య ఆకాశమే నీ హద్దురా చిత్రంపై ఉంది. షూటింగ్‌ దాదాపుగా పూర్తి అయ్యింది. మిగిలి ఉన్న ప్యాచ్‌ వర్క్‌ను లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత పూర్తి చేస్తాము. సరైన సమయంలో సినిమాను విడుదల చేస్తామంటూ సుధ చెప్పుకొచ్చింది. అంటే సుధ వేస‌విలో ఈ చిత్రాన్నివిడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తుంద‌న‌మాట‌. 

 

ఇక విజయ్‌తో సినిమా గురించి స్పందిస్తూ… ప్రస్తుతానికి తాను మరో సినిమా గురించి ఆలోచించడం లేదు. ఇప్పటి వరకు తాను ఏ హీరోకు కనీసం కథను కూడా చెప్పలేదు. ఆకాశమే నీ హద్దురా చిత్రం తర్వాతే తదుపరి ప్రాజెక్ట్‌ గురించి ఆలోచిస్తానంటుంది. తన తదుపరి చిత్రం తమిళంలోనే ఉంటుందని హింట్‌ ఇచ్చింది. అది ఎవరితో అనేది మాత్రం ఆమె క్లారిటీ ఇవ్వలేదు. ఆకాశమే నీ హద్దురా చిత్రం హిట్‌ అయితే ఈమెకు అక్కడ స్టార్స్‌ నుండి పిలుపు వచ్చే అవకాశం ఉంది. మ‌రి మ‌రో ప‌క్క తెలుగు సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబుతో సినిమా చేస్తున్న‌ట్లు స‌మాచారం. మ‌రి ఇది వ‌ర‌కు నిజ‌మ‌నే దానికి సంబందించిన డిటేల్స్ తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: