హేమ మాలిని... ఈమె పేరు ఒకప్పుడు బాలీవుడ్ లో సంచలనం. శ్రీదేవి కి పోటీ గా ఆమె చేసిన పాత్రలు ఆమె నటించిన హీరోలు అందరూ కూడా స్టార్ హీరోలే. చిన్న చిన్న హీరోలు అందరూ కూడా ఆమె తో సినిమా చెయ్యాలి అనుకుని ఎదురు చూసిన వాళ్ళే. ఆమె అందం చూసిన వాళ్ళు ఆమె నటనకు కూడా మంచి ప్రాధాన్యత ఇచ్చే వారు. షోలే సినిమాలో బసంతి అనే పాత్రలో ఆమె ఆకట్టుకున్నారు. ఆ సినిమాలో ఆమె అందం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకున్నారు. అమాయకంగానే కాకుండా ఆమె ఆ సినిమాలో పోషించిన పాత్ర చాలా ఆకట్టుకుంది. 

 

టాలీవుడ్ హీరోలు కూడా అందరూ కూడా ఆమె తో సినిమా చెయ్యాలి అనుకున్న సందర్భాలు ఉన్నాయి. ఆమె ఫోటో లను జేబులో పెట్టుకుని తిరిగిన హీరోలు కూడా ఉన్నారు అంటే ఆమె ఏ స్థాయిలో తన అందం తో ఆకట్టుకున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అమితాబ్, ధర్మేంద్ర ఇలా ఏ హీరో సినిమా చూసినా సరే ఆమె లేకుండా ఉండేది కాదు. ఆమె ప్రతీ సినిమాలో కూడా నటనకు కూడా ప్రాధాన్యత ఇచ్చే వారు. నటన తోనే కాదు అందం తో కూడా ఆమె మంచి పేరు తెచ్చుకున్నారు. ఆమె పట్టుకుంటే చాలు అనుకున్నట్టు చాలా మంది అభిమానులు చూసారు. 

 

బాలీవుడ్ హీరోలు అయితే ఆమె గురించి ఇంట్లో బార్యలతో కూడా గొడవలు పడిన సందర్భాలు కూడా ఉన్నాయి అనేది వాస్తవం ఇప్పటికి హీరోయిన్ గురించి మాట్లాడితే హేమ మాలిని లా ఉండాలి అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు కొందరు. ఆ విధంగా ఇండియన్ సినిమాలో తన ముద్ర వేసుకున్నారు హేమ మాలిని. ఇక ఆమె సినిమాల్లో ఆమె పోషించిన పాత్రలు కూడా హైలెట్. అగ్ర హీరోలతో ఎక్కువ సినిమాలు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: