టాలీవుడ్ లో ప్రస్తుతం టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతున్న వారెవరని అంటే టక్కున గుర్తొచ్చే పేరు థమన్. ఒకప్పుడు థమన్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా పెట్టుకోవడానికి సంకోచించినవారు సైతం ఇప్పుడు థమన్ కోసం వెయిట్ చేస్తున్నారు. అల్లు అర్జున్ హీరోగా నటించిన అల వైకుంఠపురములో ఆల్బమ్ బ్లాక్ బస్టర్ అవడంతో అందరూ థమన్ వైపే చూస్తున్నారు. అల వైకుంఠపురములోని సామజవరగమనా పాట మొదలుకుని, రాములో రాములా, బుట్టబొమ్మ వంటి పాటలు ఎల్లలు దాటి ఎందరి చేతనో స్టెప్స్ వేయించాయి.

 

యూట్యూబ్ లో సంచలనం సృష్టించిన ఈ పాటలు ఒక మిలియన్ వ్యూస్ దక్కించుకోవడం విశేషం. అయితే గతంలో థమన్ పాటలు ఈ విధంగా ఉండేవి కావు. పాటల్లో మ్యూజిక్ తప్ప మాటలు వినిపించవనే విమర్శ బాగా వినిపిస్తుండేది. కానీ మహానుభావుడు, తొలిప్రేమ, అరవింద సమేత చిత్రాల ద్వారా చాలా మారిన థమన్ అల వైకుంఠపురములో మ్యూజిక్ తో తానేంటీ నిరూపించుకున్నాడు.

 

ఇప్పుడు థమన్ కి అవకాశాలు వెల్లవలా వచ్చి పడుతున్నాయి. బుట్టబొమ్మ సాంగ్ ఖండాంతరాలు దాటి ఆస్ట్రేలియన్ క్రికెటర్ చేత స్టెప్పులు వేయించడంతో థమన్ క్రేజ్ ఇంకా పెరిగిపోయింది. టాలీవుడ్ నుండే కాకుండా ఇతర భాషల ఇండస్ట్రీల నుండి థమన్ కి పిలుపొస్తుంది. కోలీవుడ్ హీరో ఇళయదలపతి విజయ్, మురుగదాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడని తెలిసిందే.

 

సినిమా మ్యూజిక్ కోసం థమన్ ని పిలవాలని అనుకుంటున్నారట. అల వైకుంఠపురములో సినిమా విజయంలో మ్యూజిక్ పాత్ర ఎంత ఉందో తెలుసుకున్నాక విజయ్ ఈ నిర్ణయం తీసుకున్నాడట.  అయితే ఈ అవకాశం వస్తే థమన్ రేంజ్ మారిపోతుంది. అలాగే థమన్ పై ఒత్తిడి కూడా పెరగనుంది. గతంలోనూ థమన్ చేతిలో ఎన్నో చిత్రాలున్నప్పుడు కూడా మ్యూజిక్ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ కానీ థమన్ బాగానే హ్యాండిల్ చేయగలడని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: