మన తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతుంది అనుకున్న హీరోయిన్స్ లో ప్రత్యేకంగా చెప్పుకునే హీరోయిన్ ఆర్తి అగర్వాల్. ఆమె చేసిన సినిమాలు చాలా తక్కువే అయినా ఆమె మాత్రం ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. అగ్ర హీరోల సినిమాల్లో ఆమె చేసిన పాత్రలు యువ హీరోల సినిమాల్లో ఆమె చేసిన పాత్రలు అన్నీ కూడా ప్రేక్షకులకు బాగా నచ్చాయి. చీర కట్టు అయినా మరొకటి అయినా సరే సరిగా సరిపోతుంది ఆర్తి. హీరోయిన్ గా ఆమె చేసిన సినిమాలు చాలా తక్కువ. 

 

ఆమె చిరంజీవి హీరో గా వచ్చిన ఇంద్రా సినిమాలో చేసిన స్నేహ లతా రెడ్డి అనే పాత్రలో ఆమె చీరకట్టు ఆమె గ్లామర్ చాలా ఆకట్టుకుంది ప్రేక్షకులను. ఆ విధంగా ఆర్తి అగర్వాల్ ప్రేక్షకులను మెప్పించారు. వెంకటేష్ హీరో గా వచ్చిన సినిమాల్లో కూడా ఆమె చాలా బాగా నటించారు అందం తో ఆకట్టుకున్నారు. తరుణ్ హీరో గా వచ్చిన సినిమాల్లో ఆమె నటించి మెప్పించారు అందం తో ఆకట్టుకున్నారు అనేది వాస్తవం. ఆమె ఆ తర్వాత అవకాశాలు రాకపోయినా సరే ఆమె మాత్రం కొంత మంది ప్రేక్షకులకు అలా నిలిచిపోయారు అనేది వాస్తవ౦. 

 

ఆమె నటన కంటే ఆమె అందానికే ఎక్కువగా ప్రాధాన్యత ఉండేది. అగ్ర హీరోల సినిమాలు అయినా సరే ఆమె ఎక్కువగా హైలెట్ అయ్యేవారు. హోమ్లీ గా ఉంటుంది ఆర్తి అని హీరోలు కూడా వ్యాఖ్యానించిన సందర్భాలు ఉన్నాయి అనేది వాస్తవం. ఆమె మరణం కూడా అందం కోసమే.. ఆమె అందం పోయింది లావు అయిపోయింది మంచి అవకాశాలు రావడం లేదు అని ఆమె చేయించుకున్న ఆపరేషన్ లు ఆమె ప్రాణాలను తీసాయి అనేది వాస్తవం. ఆమె అందం కోసం చాలా కష్టపడింది. ఏడేళ్ళ క్రితం ఆమె మరణించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: