రాశి ఖన్నా.. ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు. `మనం` సినిమాతో టాలీవుడ్‌లో అడుగు పెట్టిన ఈ బ్యూటి `ఊహలు గుసగుసలాడే` సినిమాతో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది. ఆ తర్వాత తక్కువ టైంలోనే రాశి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. పలువురు స్టార్ హీరోల చిత్రాల్లో నటించింది. తన బబ్లీ లుక్స్, క్యూట్ యాక్టింగ్ తో అందరి దృష్టిని ఆకర్షించిన రాశి ఖన్నా చాలా త‌క్కువ స‌మ‌యంలో రేసులోకి వచ్చేసింది. అయితే మొదట్లో హిట్స్ వచ్చినా వెనువెంటనే వచ్చే ప్లాప్స్ తో ఆమె టాప్ స్థానాన్ని కైవసం చేసుకోలేకపోయింది. అయిన‌ప్ప‌టికీ ఆమె క్రేజ్ మాత్రం త‌గ్గ‌లేద‌నే చెప్పాలి. ఇక టాలీవుడ్‌లో అడుగు పెట్టిన మొద‌ట్లో బొద్దుగుమ్మ ఉంటే ఈ బ్యూటి ఇప్పుడు ముద్దుగుమ్మగా మారి ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ర్షించింది. 

 

అలాగే గతేడాది వెంకీ మామ, ప్రతిరోజూ పండగే వారం రోజుల వ్యవధిలో రిలీజవ్వడమే కాకుండా రెండూ కూడా సూపర్ హిట్స్ గా నిలిచాయి. ఈ రెండిట్లో రాశి ఖన్నా హీరోయిన్ గా నటించింది. దీంతో మళ్ళీ తెలుగులో ఆమెకు అవకాశాల వెల్లువ ఉంటుందని అందరూ ఫిక్స్ అయ్యారు. కానీ, ఈమె ఎప్పుడైతే  విజయ్ దేవరకొండ హీరోగా నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా చేసిందో.. అప్ప‌టి నుంచి ఈమె విమ‌ర్శ‌లు ఎదుర్కొంది. వాస్త‌వానికి కెరీర్ మొదలు పెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు అందాల ఆరబోత విషయంలో రాశి ఖన్న పెద్దగా హద్దులు దాటింది లేదు. కానీ, వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా మాత్రం కాస్త బోల్డ్‌గా న‌టించ‌డంతో విమర్శలు అందుకుంది. 

 

రాశి ఖన్నా అభిమానులకు కూడా ఆమె అలాంటి పాత్రలు చేయడం నచ్చలేదంటూ టాక్ కూడా వ‌చ్చింది. ఇక ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర అట్టర్ ఫ్లాప్ అయింది. రాశి ఖన్నా చేసినదంతా బూడిదలో పోసిన పన్నీరైంది. చివరకు అభిమానుల ట్రోల్స్‌కు గురైంది. వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాతో హీరోయిన్‌గా రాశీ ఖన్నాపై బ్యాడ్ ఇంప్రెషన్ పడిపోయింది. ఈ దెబ్బ‌తో రాశి అలాంటి క్యారెక్టర్ చేసి పెద్ద తప్పు చేసినట్టు చెంపలు వాయించుకుంది. ఇక ముందు ఇలాంటి పాత్రలు అస్స‌లు చేయన‌ని చెప్పుకొచ్చింది. ఇక ఏది ఎలా ఉన్నా.. న‌ట‌న ప‌రంగానే కాకుండా అందంతో కూడా ఆక‌ట్టుకున్న రాశి ప్ర‌స్తుతం తమిళంలో రెండు ప్రాజెక్టులు చేస్తున్నట్లు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: