rrr సినిమా... ఈ సినిమా గురించి గత కొన్ని నెలలుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో చర్చలు సాగుతనే ఉన్నాయి. ఇక ఈ సినిమాకు సంబంధించి ఏ చిన్న విషయం కానివ్వండి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతుంది. దీనికి కారణం దర్శాదుడు రాజా మౌళి, ప్రస్తుత టాలీవుడ్ అగ్ర హీరోలు రామ్ చరణ్, జూనియర్. ఎన్టీఆర్. ఈ ఇద్దరి హీరోల సినిమా కాబట్టి అభిమానులలో ఒకింత ఆత్రుత ఎక్కువుగా ఉందనే చెప్పాలి. ఇక ఎన్టీఆర్,రామ్ చరణ్ వంటి మాస్ హీరోలతో చేస్తోన్న భారీ మల్టీస్టారర్ పై ఇండియ‌న్ సినిమా ఇండ‌స్ట్రీ అంతా ఇప్పుడు ఈ సినిమాపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

 


ఇక ఈ సినిమాలో హీరోయిన్ ల విషయానికి వస్తే ... ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ నటిస్తుండగా మరోవైపు జూ. ఎన్టీఆర్ సరసన ఒలీవియా మోరీస్ నటిస్తోంది. అయితే ప్రస్తుతం కరోనా కారణంగా ఈ చిత్రానికి సంబంధించిన అన్ని షూటింగ్ పనులు వాయిదా పడినట్టు తెలిసిన విషయమే. దీనితో ఇప్పుడు ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని 2021, ఏప్రిల్ 28న విడుదల చేయాలనే ప్లాన్‌ లో ఉన్నారు చిత్ర యూనిట్ సభ్యులు. 

 


ఇకపోతే, తాజాగా rrr చిత్రంలో అలియా భట్ పాత్రపై క్లారిటీ ఇచ్చారు దర్శక ధీరుడు రాజమౌళి‌. rrr సినిమాలో సీత పాత్ర కోసం ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య కలిసి నటించగలిగే నటి నాకు కావాలని, అది ఎందుకంటే వీళ్లిద్దరు ఎంతో టాలెంట్ ఉన్న నటులు కాబట్టి సీత పాత్ర అమాయకంగా ఉండాలి అంతేకూండా గడుసుదనం కూడా ఉండాలి అని ఆయన తెలిపాడు. కాబట్టి ఈ పాత్ర కోసం ఆలియాను ఎంపిక చేసినట్టు ఆయన విషయాన్నీ చెప్పుకొచ్చారు. అయితే ఇది ట్రయాంగిల్ లవ్ స్టోరీ అనుకునేరు, కానే కాదు. ఈ సినిమాలో ఆలియా భట్ రామరాజు మరదలు సీతగా కనిపించి ప్రేక్షకులను తన నటనతో అమాంతం ఆకట్టుకుంటుందని ఖాయం అని  ఆయన తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: