బుల్లితెరపై తన ప్రస్థానం మొదలు పెట్టి కథారచయితగా మంచి పేరు సంపాదించారు వక్కంతం వంశి.   'కిక్' , 'రేసు గుర్రం' , 'టెంపర్' సినిమాలకు కథారచనలో తనదైన మార్క్ చాటుకున్నారు వక్కంతం వంశి.  ఆ తర్వాత దర్శకత్వం వైపు చూపు మరల్చాడు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో ‘నాపేరు సూర్య.. నా ఇల్లు ఇండియా’ లాంటి దేశభక్తి నేపథ్యంలో మూవీ తెరకెక్కించాడు.  అయితే ఈ మూవీలో కమర్షియల్ ఎలిమెంట్స్ పెద్దగా లేకపోవడంతో బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది. ఈ మూవీ యాక్షన్, ఎమోషన్ కి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ఆయన రూపొందించారు.   ఈ మూవీ తర్వాత అల్లు అర్జున్ కూడా చాలా గ్యాప్ తీసుకునే పరిస్థితి నెలకొంది.  ఆ తర్వాత అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో ‘అల వైకుంఠపురములో’ లాంటి కమర్షియల్ హిట్ అందుకున్నాడు.  

 

నాపేరు సూర్య తర్వాత వక్కంతం కూడా చాలా గ్యాప్ తీసుకున్నాడు.  ఈ గ్యాప్ లో ఆయన మరో మంచి కథకు శ్రీకారం చుట్టినట్లు సమాచారం. అయితే ఇంత గ్యాప్ తీసుకోవడంతో దర్శకత్వం జోలికి వెళ్లకుండా కథలపైనే దృష్టి పెడతాడని అంతా అనుకున్నారు.  తమ కోసం విభిన్నమైన కథలను సిద్ధం చేసిపెట్టమని చాలామంది హీరోలు వక్కంతం వంశీతో చెప్పారట. కానీ ఆయన మాత్రం మళ్లీ దర్శకత్వం వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది.  ఈ నేపథ్యంలో  కథను సిద్ధం చేసుకుంటున్నట్టు సమాధానమిస్తున్నాడట.

 

 అల్లు అర్జున్ తో మంచి సాన్నిహిత్యం వున్న కారణంగా, దర్శకుడిగా తనకి మరో ఛాన్స్ ఇవ్వమని వక్కంతం వంశీ అడిగినట్టు చెబుతున్నారు. అల్లు అర్జున్ సైతం బలమైన కథ అయితే.. దాంతో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటే ఆలోచన చేద్దామని అల్లు అర్జున్ అనడంతో, ఆయనకి కథను వినిపించే పనిలో వంశీ ఉన్నాడని అంటున్నారు. మరి గతంలో అనుభవంతో మనోడు మంచి కథ రూపొందించారా? అల్లు అర్జున్ వంశీ మాట కాదనలేక అలా అన్నాడా? లేదంటే నిజంగానే అవకాశం ఇస్తాడా? అనేది వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: