సౌంద‌ర్య అద్భుత‌మైన స్థాయికి ఎదిగిన న‌టీమ‌ణి. స్వ‌త‌హాగా సౌంద‌ర్య క‌న్న‌డ క‌స్తూరి అయినా తెలుగు లోగిళ్ల  ఆడ‌పడుచై పోయింది. తెలుగువారి గుండెల్లో నిలిచిపోయింది. ప్ర‌ముఖ ర‌చ‌యిత మ‌హార‌థి, ఆయ‌న కుమారుడు వ‌ర‌ప్ర‌సాద్ రైతుభార‌తం చిత్రాన్ని నిర్మిస్తూ క‌న్న‌డంలో ఒక చిత్రం చూసి సౌంద‌ర్య‌ను తెలుగుకు తీసుకువ‌చ్చారు. అయితే రైతు భార‌తం నిర్మాణం ఆల‌స్యం కావ‌డంతో సౌంద‌ర్య న‌టించిన మ‌రో చిత్రం ముందుగా విడుద‌లైంది. సౌంద‌ర్య అన‌తికాలంలోనే ఉత్త‌మ న‌టిగా పేరు తెచ్చుకుంది. ఎంతో బిజీగాఉన్న స‌మ‌యంలో రాజ‌కీయ నాయ‌కుల ఒత్తిడి కార‌ణంగా బిజెపిలో చేరింది.

 

నీకు రాజ‌కీయాలు వ‌ద్ద‌మ్మా అని సౌంద‌ర్య తండ్రి స‌త్య‌నారాయ‌ణ‌మూర్తికి, సౌంద‌ర్య‌కు ఎంత‌గానో చెప్పారు. డా.దాస‌రి నారాయ‌ణ‌రావు, డా. మోహ‌న్‌బాబు, జ‌గ‌ప‌తిబాబు వంటి ప్ర‌ముఖులు. తండ్రి స‌త్య‌నారాయ‌ణ పై విప‌రీత‌మైన ఒత్తిడి పెర‌గ‌డంతో సైంద‌ర్య రాజ‌కీయాల్లోకి వెళ్ల‌క త‌ప్ప‌లేదు. ఇక పార్టీ ప్ర‌చారం కోసం ఫ్లైట్‌లో వెళుతుండ‌గా అది కూలిపోవ‌డం సౌంద‌ర్య‌, ఆమె సోద‌రుడు అకాల మ‌ర‌ణం చెంద‌డం జ‌రిగిపోయాయి. రాజ‌కీయాల్లోకి ర‌మ్మ‌న్న రాజ‌కీయ నాయ‌కులు ఆ మ‌హాన‌టికి ప్రాణాలు పోయ‌లేక పోయారు.  సావిత్రి త‌ర్వాత మ‌ళ్లీ అంత‌టి మ‌హాన‌టిగా.. ఆమెలేని కొర‌త‌ను తీర్చే న‌టిగా సౌంద‌ర్య‌ను భావించారు ప్రే‌క్ష‌కులు. కాని ఆమె మ‌రణించింది. మ‌రో సావిత్రి రాన‌ట్టే, మ‌రో సౌంద‌ర్య ఇంత‌వ‌ర‌కు రాలేదు. ఇది మ‌న దుర‌దృష్టం. ఇక సౌంద‌ర్య త‌ను ఎప్పుడూ కూడా మిగ‌తా హీరోన్ల‌వ‌లె ఎక్కువ‌గా ఎక్స్‌పోజింగ్ చేసేదికాదు.

 

అయిన‌ప్ప‌టికి ఆమె మంచి అంద‌గ‌త్తె ఆమె చీర‌క‌ట్టు చాలా బావుండేది. వెంక‌టేష్‌తో, శ్రీ‌కాంత్‌తో, జ‌గ‌ప‌తిబాబుతో అనేక సినిమాల్లో న‌టించింది. ఇక ఆ చిత్రాల‌న్నిటిలో కూడా చాలా హోమ్లీ పాత్ర‌ల్లో చీర‌క‌ట్టుకుని ఎంతో అందంగా క‌నిపించేది సౌంద‌ర్య‌. ఆమె న‌వ్వు ఆమె ముఖానికి అంద‌మ‌ని చెప్పాలి. ఆమె అమాయ‌క‌పు చూపులు ఆమెకు మ‌రింత‌గా అందాన్నిచ్చేవి. బ‌ట్ట‌ల‌ను ఎంత నిండుగా ధ‌రించిన‌ప్ప‌టికీ ఆమె అందం ఎంతో గొప్ప‌గా ఉండేది. అప్ప‌ట్లో కుర్రాళ్ళు ఎవ‌రైనా స‌రే సౌంద‌ర్య‌లాంటి భార్య కావాలి అని కోరుకునేవారు. అంత అంద‌మైన క‌ట్టుబొట్టు ఉండేది ఆమెలో. 

మరింత సమాచారం తెలుసుకోండి: