మీనా కుమారి అనే అద్భుత‌న‌టి హిందీ చిత్రాల న‌టి అయినా భార‌త‌దేశంలోని సినిమా ప్రేక్ష‌కుల‌కు స‌ప‌రిచిత‌మైన న‌టి. భాషాభ‌స్త్రదం అనేది లేకుండా అన్ని భాష‌ల‌కు చెందిన ప్రేక్ష‌కులూ మీనాకుమారి కోస‌మైనా ఆ చిత్రాన్ని చూసేవారు! హ‌ఙందీ చిత్రాల‌కు ఇత‌ర దేశాల‌లో కూడా ఆద‌ర‌ణ ఉంది. గ‌నుక ఆయా దేశాల ప్రేక్ష‌కుల‌కు కూడా ఆద‌ర‌ణ ఉంది. గ‌నుక ఆయా దేశాల ప్రేక్ష‌కుల‌కు కూడా మీనాజీ ప్రీతిపాత్ర‌మైపోయింది. ఆ విధంగా అప్ప‌ట్లో ఆ గ్రేట్ ఆర్టిస్ట్ ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత న‌టీమ‌ణి అయింది. విషాద పాత్ల పోష‌ణ‌కు త‌న‌కు మించిన న‌టి లేర‌నిపించుకున్నాను అప్ప‌ట్లో, ఇప్ప‌టికీ ఆ త‌ర‌హా పాత్ర‌ల పోష‌ణ‌కు ముందుగా చెప్పుకునే పేరు మీనేజీ పేరునే. ఆమె పోషించిన విషాద పాత్ర‌ల‌లాగే ఆమె జీవిత‌మూ ఆద్యంతం విషాద‌మ‌య‌మైపోయింది. ఆ విషాద పాత్ర‌లే ఆమె జీవితంలోనూ చోటు చేసుకోవ‌టం అత్యంత విచార‌క‌మైన విష‌యం. కొన్ని జీవితాలు విషాదం అనే గ‌ర‌ళం మింగ‌డానికి మాత్ర‌మే పుడ‌తాయా? ఎందుకు ఆ సృష్టి అలా చేస్తాడు. 

 

దారిద్ర‌యంలో పుట్టి పెరిగిన మీనాకుమారికానీ, సావిత్రికానీ అపార‌మైన తెలివితేట‌లు క‌లిగిన మ‌హిళామ‌ణులు, ఇక అంద‌చందాల విష‌యానికి వ‌స్తే వాళ్ల ముందు మ‌రో తార క‌నిపించ‌రు. ఇంత తెలివితేట‌లు, అభిమాన ధ‌నం, అంగ‌బ‌లం, ఆర్ధిక బ‌లాలు, ముఖ్యంగా ఎంద‌రో హితులు, స్నేహితులు ఉండి కూడా వారి మ‌న‌సులు ఎందుకు త‌ప్పుదారిప‌ట్టాయి? ఎందుకు క‌ష్టాల‌కు లోన‌య్యారు? వ‌ఇప‌రీతంగా ధ‌నాన్ని సంపాదించుకుని కూడా ఎందుకు నిగ్ర‌హించుకోలేక‌పోయారు? ఇక సావిత్రి క‌నీసం మూడో ఫారం వ‌ర‌కైనా చ‌దివింది. కానీ మీనాకుమారి అస‌లు స్కూలుకే వెళ్ల‌లేదు. ఆమె క‌ళ్ళు పెద్ద‌గా ఉండేవి చాలా అందంగా ఉండేవి. స‌గం క‌ళ్ళ‌తోనే అన్ని భావాల‌ను ప‌లికించేసేది మీనాకుమారి. ఇక క‌నుబొమ్మ‌ల విష‌యానికి వ‌స్తే చ‌క్క‌గా ఎంతో ఒత్తుగా అందంగా ఉండేవి. ఆమె చూస్తూ ఉంటే  క‌నురెప్ప కూడా వేయాలనిపించ‌దు. అంత‌ అందంగా ఉండేది. 

మరింత సమాచారం తెలుసుకోండి: