సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం హ్యాట్రిక్ విజయాలతో టాలీవుడ్ లో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. కథల ఎంపిక విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్న సూపర్ స్టార్ మహేష్ బాబు హ్యాట్రిక్ విజయాలను అందుకున్నారు. ఏడాది సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి.. . మరో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు 27వ సినిమాకు సంబంధించి అప్డేట్ గురించి మహేష్ బాబు అభిమానులు అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే గీతగోవిందం ఫ్రేమ్ పరశురామ్ దర్శకత్వంలో మహేష్ నెక్స్ట్ మూవీ ఫిక్స్ అయిన విషయం తెలిసిందే. 

 

 

 అయితే ఈ సినిమా చిత్రీకరణ ఇప్పటికే మొదలు కావాల్సి ఉండగా కరోనా  వైరస్ కారణంగా ఈ సినిమా చిత్రీకరణ ఇప్పటి వరకు మొదలు కాలేదు. కాగా ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా ఓ సరికొత్త లవ్ స్టోరీ కథ అని ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తుంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

 

 

 సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా మహేష్ బాబు 27వ సినిమా ఫస్ట్ లుక్ ను లాంచ్ చేయాలని భావిస్తున్నారట చిత్రబృందం. కాగా  సూపర్ స్టార్ కృష్ణ ఈ నెల 31 వ తేదీన తన పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. దీంతో సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు నాడు ఈ సినిమా యొక్క టైటిల్ ను విడుదల చేయడమే కాకుండా మహేష్ బాబు ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోందట. దీనికి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. కాగా ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనే దాని పై ఇద్దరు ముగ్గురు పేర్లు  ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాకు హీరోయిన్ ఎవరు అనేది ఇంకొన్ని రోజుల్లో ఫైనల్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గీత గోవిందం లాంటి సినిమాను తెరకెక్కించిన దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కిస్తుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇక మహేష్ బాబు మరోసారి ఈ సినిమాతో కూడా భారీ విజయం సాధిస్తాడు అనేది ధీమాతోనే ఉన్నారు అభిమానులు.

మరింత సమాచారం తెలుసుకోండి: