యుధ్ధం మొదలైపోయింది. అది కరోనా కట్టడికి యుధ్ధం ఓ వైపు సాగుతోంది. మరో వైపు శత్రు దేశాలతో సరిహద్దుల్లో యుధ్ధం సాగుతోంది. ఇంకో వైపు రాజకీయ కామందుల మధ్యన ప్రతీ రోజూ  యుధ్ధమూ సాగుతోంది. ఇపుడు కరోనా పుణ్యమాని భార్యాభర్తల్లా ఉన్న నిర్మాతలు, ధియేటర్ల యజమానుల మధ్యన కూడా భారీ యుధ్ధం జరిగిపోతోంది.

 


వారు బొమ్మ తీయాలి. వీరు బొమ్మ ఆడించాలి. లాభాలు ఇద్దరూ పంచుకోవాలి. ఇదీ కదా ఇంతవరకూ సాగిన కధ. నిజానికి ఎంతటి నిర్మాత అయినా ధియేటర్లు లేకపోతే లేడు. అందుకే బడా నిర్మాలు అంతా కూడా చేతిలో చాలా ధియేటర్లను నైజాం, సీడేడ్, కోస్తా తేడా లేకుండా లీజుకు తీసుకుని దందా చేస్తున్నారన్న విమర్శలు కూడా వచ్చాయి

 

ఇపుడు చూస్తే నిర్మాతలు కరోనా దెబ్బకు విలవిలలాడుతున్నారు. ఏ విధంగా బయటపడాలని వారు చూస్తున్నారు. దాంతో వారు ఓటీటీ ఫ్లాట్ ఫారం మీద చూపు పెడుతున్నారు. తమ బొమ్మ ఎలాగైనా ఆడియన్ దగ్గరకు చేరాలన్నది వారి ఆలోచన. ఇందులో తప్పులేదు. సినిమాలు తీసేదే కాసుల కోసం

 

అది అసలైన వినియోగదారుడు ఆడియన్ వద్దకు చేరకపోతే ఎంత శ్రమ పడినా వ్రుధావే. అయితే నిర్మాతలు తీసే సినిమా మీదనే  ఆధారపడి కోట్లకు కోట్లు పెట్టి ధియేటర్లు కట్టుకున్న యజమానులు ఈ పరిణామాలకు తల్లడిల్లిపోతున్నారు. మీ దారి మీరు చూసుకుంటే మేమెట్టా బతికేది అంటున్నారు.

 

ఇదేనా మీ నీతి అంటూ గట్టిగానే తగులుకుంటున్నారు. ఇక ఐమాక్స్ మాల్స్ యజమానుల గోడు చూస్తే వెక్కి వెక్కి ఏడుస్తున్నారుట. సినిమా కోసం ఇంత పెద్ద ఎత్తుమ సొమ్ములు పోసి కట్టామని, ఇపుడు ఓటీటీ అంటూ మీరు వేరే దోవకు పోతే మేమేం అయిపోవాలి అంటూ కస్సుమంటున్నారు. 

 

ఎట్టిపరిస్థితుల్లోనూ సినిమాను ఓటీటీకి ఇవ్వవద్దని, ధియేటర్లలోనే సినిమాను విడుదల చేయాలని గట్టిగా కోరుతున్నారు. అంతే కాదు, డిమాండ్ చేస్తున్నారు కూడా. మరి  కరోనా వచ్చి ఈ చిచ్చు పెట్టేసింది. ఇందులో వివాదాలు సర్దుబాటు చేసుకుని ఇద్దరూ గతంలోలా ఒక్కటిగా ఉంటారా. లేదా చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: