దేశం మొత్తం లాక్ డౌన్ ఉన్న నేపథ్యంలో చాలామంది ఆర్ధిక ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ తమ ఔదార్యంతో అనేకమందికి నిత్యావసరాలు అందిస్తున్నారు. మరికొందరు అన్నదానం చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో తెలుగు సినిమా సంగీత దర్శకుడు.. దివంగత చక్రి కుటుంబం చిక్కుకుంది. ప్రస్తుత కరోనా సమయంలో చక్రి తల్లి, తమ్ముడు మోహిత్ ఆర్ధిక ఇబ్బందుల్లో ఉండి ఇబ్బందులు పడుతున్నారు. వారి పరిస్థితిని తెలుసుకున్న ఓ నిర్మాత వారి కుటుంబాన్ని కలిసి సాయం చేశారు.

 

 

హైదరాబాద్ కు చెందిన ‘కోవిద సహృదయ ఫౌండేషన్’ మణికొండలోని చక్రి కుటుంబాన్ని ఈరోజు కలిసి సాయం చేశారు. ఈ సంస్థ వ్యవస్థాపకురాలు, నిర్మాత అయిన డాక్టర్ అనూహ్య రెడ్డి చక్రి కుటుంబానికి నెల రోజులకు సరిపడే నిత్యావసరాలు అందించారు. వీటితో పాటు పండ్లు, కోడిగుడ్లు అందించారు. అయితే.. తనకు ఏదైనా అవకాశం ఇప్పించాల్సిందిగా అనూహ్య రెడ్డిని మోహిత్ కోరాడు. దీంతో.. కరోనాపై ఓ ట్యూన్ చేయాల్సిందిగా ఆమె కోరారు. అనూహ్య రెడ్డి ఇచ్చిన భరోసా తనకు ధైర్యం కలిగించిందని మోహిత్ అంటున్నాడు. ఇప్పటికి తాను నాలుగు సినిమాలకు సంగీతం అందించానని అన్నారు. ప్రస్తుతం చక్రి కుటుంబం ఉన్ని పరిస్థితి అందరినీ కలచివేస్తోంది.

IHG

 

అనూహ్య రెడ్డి ఫౌండేషన్ అనేకమందికి నిత్యావసరాలు, గుడ్లు, ఆహారం, శానిటైజర్లు, మాస్కులు కూడా పంపిణీ చేస్తున్నారు. ఇందులో భాగంగా చక్రి కుటుంబాన్ని ఆదుకోవడంతో వారికి ప్రశంసలు లభిస్తున్నాయి. తెలుగు సినిమాల్లో తనదైన ముద్ర వేసిన సంగీత దర్శకుల్లో చక్రి ఒకరు. తక్కువ సమయంలోనే సక్సెస్ ఫుల్ సంగీత దర్శకుడిగా ఎదిగాడు. పూరి జగన్నాధ్ ఆస్థాన సంగీత దర్శకుడిగా చక్రి అనేక సినిమాలకు పని చేశాడు. 40ఏళ్ల వయసులోనే చక్రి మరణించడం వారికి శాపమైంది. చక్రి మరణంతో వారి కుటుంబంలో వివాదాలు జరగడం తెలిసిన విషయమే.

మరింత సమాచారం తెలుసుకోండి: