తెలుగు సినిమాల్లో అతి తక్కువ సమయంలోనే తన హవా చూపించింది రకుల్ ప్రీత్ సింగ్. తొలి సినిమాతోనే హిట్ కొట్టి ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయింది. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమా సక్సెస్ ఆమెకు ఏకంగా స్టార్ హీరోల పక్కన అవకాశాలు తెచ్చిపెట్టింది. వరుస సక్సెస్ లతో దూసుకెళ్లిపోయిన రకుల్ ఈ మధ్య తెలుగులో వెనుకబడిపోయింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రకుల్ తన జిమ్ వీడియోలు పోస్ట్ చేస్తోంది. ప్రస్తుతం రకుల్ కు సంబంధించిన ఓ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది.

 

 

ముఖానికి మాస్క్ ధరించిన రకుల్ ప్రీత్ సింగ్ ఓ మెడికల్ షాపులో ఏవో మందులు కొనుక్కుని వస్తున్న వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. వైట్ కలర్ టీషర్టు, ఫుల్ టైట్ బ్లాక్ జీన్స్ లో రకుల్ ఫిట్ గా ఉంది. ప్రస్తుత లాక్ డౌన్ పరిస్థితుల్లో రకుల్ సాధారణ యువతిలా బయటకు వచ్చి మెడిసిన్స్ కొనుగోలు చేయడం ఓ వ్యక్తి వీడియో తీసి ఇంటర్నెట్ లో పోస్ట్ చేశాడు. రకుల్ వెళ్తుంటే ఏదో అడగబోతే ‘వద్దు.. అవసరం లేదు’ అని రకుల్ అనడం కూడా ఆ వీడియోలో ఉంది. ఈ వీడియోను నెటిజన్లు బాగా షేర్ చేస్తున్నారు. రకుల్ వీడియోకు సంబంధించి ఇది ముంబయ్ లోని బాంద్రా ఏరియా అని అంటున్నారు.

 

 

కెరీర్ పరంగా ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ భారతీయుడు2, శివ కార్తికేయన్ హీరోగా వస్తున్న అయలాన్ సినిమాల్లో నటిస్తోంది. హిందీలో థ్యాంక్ గాడ్, అటాక్, ఛలే ఛలో.. సినిమాల్లో నటిస్తోంది. తెలుగులో స్టార్ హీరోలతో నటించిన రకుల్ కు ప్రస్తుతం అవకాశాలు లేవు. కానీ.. హిట్ పర్సంటేజ్ బాగానే ఉంది. నాగ్ తో చేసిన మన్మథుడు2 ఫ్లాప్ తర్వాత అమ్మడికి అవకాశాలు తగ్గాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: