టాలీవుడ్ లో ఎంతో మంది సీని, వ్యాపార రంగానికి చెందిన వారు హీరోలుగా పరిచయం అయ్యారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సోదరుడు తనయుడు నారా రోహిత్ ‘బాణం’ మూవీతో హీరోగా వెండితెరపై అడుగు పెట్టాడు.  మొదటి మూవీ మంచి విజయం అందుకుంది.  మే 5 రోహిత్‌కి ఎప్ప‌టికీ గుర్తుంచుకొనే ప్ర‌త్యేక‌మైన రోజు.. ఆయ‌న న‌టించిన మొద‌టి సినిమా ‘బాణం’ 2009లో విడుదలైంది ఈ రోజే.  ఈ సందర్బంగా ‘‘2009లో ఈ రోజు, ఇది ‘బాణం’ మూవీలో నా ఫ‌స్ట్ షాట్‌. ఈ సంద‌ర్భంగా నా మెంటార్‌, పెద‌నాన్న చంద్ర‌బాబునాయుడు ‌గారు, డియ‌రెస్ట్ లోకేష్ అన్న స‌ర‌స‌న ట్విట్ట‌ర్‌లో జాయిన్ అవ‌డం గౌరవంగా, ఆనందంగా ఉంది. అయితే నారా రోహిత్ నటించిన సినిమాలు పెద్దగా కమర్షియల్ హిట్ కాలేదు కానీ.. మనోడికి మంచి పేరు మత్రం వచ్చింది. ఈ మద్య మల్టీస్టారర్ సినిమాల్లో ఎక్కువగా నటిస్తున్నాడు.  

 

తాజాగా దేశంలో లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి సినీ సెలబ్రెటీలు అందరూ ఇంటి పట్టున ఉంటున్నారు.  ఎవరికి తోచింది వారు చేస్తూ సోషల్ మాద్యమాల ద్వారా పోస్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నారా రోహిత్ త‌న టాలెంట్‌ని చూపించి నెటిజ‌న్స్‌చే ప్ర‌శంస‌లు అందుకున్నాడు. లాక్‌డౌన్ వ‌ల‌న ఇంటికే ప‌రిమిత‌మైన రోహిత్ శివుని పెయింటింగ్‌ని చాలా చ‌క్క‌గా వేశాడు.  

 

ఇన్నాళ్లు త‌న‌లో దాగి ఉన్న టాలెంట్‌ని ఒక్క‌సారిగా  అభిమానుల ముందు పెట్టేస‌రికి ఫిదా అవ్వ‌డం వారి వంతు అయింది. ఇన్నాళ్ళు బొద్దుగా ఉన్న నారా రోహిత్ ఇప్పుడు స్లిమ్‌గా మారాడు. రీసెంట్‌గా త‌న మేకొవ‌ర్ గురించి వివ‌రించాడు. మొత్తానికి లాక్ డౌన్ సందర్భంగా ఒక్కరిలో ఉన్న కళాలు బయటకు వస్తున్నాయి. ఆ మద్య సల్మాన్ ఖాన్ ఓ బొమ్మగీశాడు.. బ్రహ్మానందం పలు ప్రముఖుల బొమ్మలు వేస్తున్నారు.  తాజాగా  శివుని పెయింటింగ్‌ని చాలా చ‌క్క‌గా వేశాడు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: