మెగా హీరో వరుణ్ తేజ్ ముకుంద సినిమాతో తెరంగేట్రం చేశాడు. మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన హీరోగా క్రేజ్ తెచ్చుకున్న వరుణ్ తేజ్ ఫిదా సినిమాతో కమర్షియల్ హిట్ అందుకున్నాడు. ఇక ఆ తర్వాత తొలిప్రేమతో కెరియర్ స్ట్రాంగ్ చేసుకున్నాడు. గద్దలకొండ గణేష్ సినిమాతో నటుడిగా తనలోని కొత్త కోణాన్ని చూపించిన వరుణ్ తేజ్ మెగా ప్రిన్స్ గా స్క్రీన్ నేమ్ సాధించాడు. ప్రస్తుతం వరుణ్ తేజ్ బాక్సర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ బాక్సర్ గా తన సత్తా చాటుతాడని తెలుస్తుంది. 

 

కెరియర్ విషయంలో పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ముందుకు వెళ్తున్నాడు వరుణ్ తేజ్ సినిమా సినిమాకు తన నటనా పరిణితి పెంచుకుంటూ ప్రేక్షకుల మెప్పు పొందుతున్నాడు. ఏదో ఒక సినిమా చేసేద్దాం అన్నట్టు కాకుండా కంటెంట్ ఉండే సినిమాలకే వరుణ్ తేజ్ ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు. కథల విషయంలో చాలా క్లవర్ గా నిర్ణయాలు తీసుకుంటున్న వరుణ్ తేజ్ యువ హీరోల్లో సక్సెస్ ఫుల్ కెరియర్ తో దూసుకెళ్తున్నారు. 

 

మెగా ఇమేజ్ సపోర్ట్ ఉన్నా సరే స్వతహాగా తనకంటూ ఓ కొత్త ఇమేజ్ సాధించేందుకు ప్రయత్నిస్తున్నాడు వరుణ్ తేజ్. అతని సినిమాల సెలక్షన్ కూడా అదే విధంగా ఉంది. సెట్స్ మీద ఉన్న బాక్సర్ సినిమాతో పాటుగా రెండు మూడు కథలు డిస్కషన్స్ స్టేజ్ లో ఉన్నాయి.  ప్రస్తుతం యువ దర్శకులతోనే సినిమాలు చేస్తున్న వరుణ్ తేజ్, స్టార్ డైరక్టర్ తో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. అదే జరిగితే మాత్రం మెగా హీరోల్లో చరణ్, బన్నీ తర్వాత వరుణ్ తేజ్ కూడా స్టార్ క్రేజ్ దక్కించుకున్నట్టే.  దానికి వరుణ్ తేజ్ పడుతున్న కష్టం కూడా అదేవిధంగా ఉంది.                 

మరింత సమాచారం తెలుసుకోండి: