టాలీవుడ్ లో అనుష్క కు ఉన్న క్రేజ్ గురించి అందరికి తెలిసిందే. ఆమె సినిమాలు అన్నీ కూడా ప్రేక్షకులను అందం పరంగా నటన పరంగా ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆమెకు తెలుగులో స్టార్ హీరోకి సమానంగా ఫాలోయింగ్ వచ్చేసింది. ఇప్పుడు ఆమె సీనియర్ హీరోయిన్. వరుసగా సినిమాలు చెయ్యాలి అని చూస్తున్నా సరే పెద్దగా ఆఫర్లు రావడం లేదని సమాచారం. ఆమె దీనితో పెళ్లి చేసుకోవాలని భావించింది అని కూడా అంటున్నారు. ఇక మ‌న తెలుగు గాసిప్ రాయుళ్లు అయితే అనుష్క కు రోజుకు ఒక స్టార్‌తో పెళ్లి చేసేస్తున్నారు. ఒక‌సారి హీరోతోనో లేదా మ‌రోసారి క్రికెట‌ర్‌తోనో పెళ్లి అంటూ నానా ర‌చ్చ ర‌చ్చ చేస్తున్నారు.

 

ఇక తాజాగా అనుష్క ప‌వ‌న్ ప‌క్క‌న క్రిష్ సినిమాలో చేస్తుంద‌ని మ‌రో పుకారు పుట్టించారు. అయితే ఇప్పుడు ఆమెకు ఒక పెద్ద ఆఫర్ వచ్చింది అని తెలుస్తుంది. మహేష్ బాబు సినిమాలో మహేష్ కి అత్తగా నటించే అవకాశం అనుష్కకి వచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. మహేష్ బాబు ప్రస్తుతం పరుశురాం దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు దాదాపుగా ఉన్నాయి. ఈ సినిమా కథ కూడా దాదాపుగా సిద్దం అయింది.

 

ఈ తరుణంలోనే ఆమెకు ఈ సినిమాలో ఒక కీలక పాత్ర ఇచ్చే ఆలోచన మహేష్ చేశాడట. ఆమె తనకు అత్తగా నటిస్తాను అంటే అడగాలి అని, మాజీ హీరోయిన్ ఎవరూ వద్దు, ఆమె చాలు అని చెప్పాడట మహేష్. ఈ సినిమాలో మ‌హేష్‌ది డ్యూయ‌ల్ రోల్ ఉంటుంద‌ట‌. ఓ క్యారెక్ట‌ర్‌కే ఆమె అత్త‌గా క‌నిపిస్తుంద‌ని టాక్‌. దీనితో చిత్ర యూనిట్ ఇప్పుడు ఆమెను సంప్రదించి అడిగింది అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత మహేష్ చేస్తున్న చిత్రం ఇదే. ఈ సినిమాకు మహేష్ కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. మే 31 న ఈ సినిమా షూటింగ్ ని మొదలుపెట్టే అవకాశం ఉందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: