ఆమె తెలుగులో మొదటి సినిమా పధ్ధతైన అమ్మాయిగా నటించింది. అది నటుడు నుంచి దర్శకుడుగ మారిన రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్లో సుశాంత్ హీరోగా నిర్మించిన చి.ల.సౌ మూవీ. ఆ మూవీలో ఫుల్ ట్రెడిషనల్ లుక్ తో రూహానీ అదరగొట్టేసింది. ఇక ఆమెను చూసిన వారంతా అచ్చ తెలుగు అమ్మాయి అనుకున్నారు.

 

పైగా అంతగత్తె. ఇంత మంచి నటికి మళ్ళీ ఆఫర్లు వెల్లువలా రాలేదు. అయితే హిట్ అన్న మూవీలో ఆమె విశ్వక్ సేన్ మూవీలో నటించింది. ఈ మూవీతో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. ఇపుడు ఆమె తెలుగులో అవసరాఅ శ్రీనివాస్ హీరోగా నటించే నూటొక్క జిల్లాల అందగాడు మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది.

 

దీంతో పాటుగా ఆమె ఎమ్మెస్ రాజు డైరెక్షన్లో కూడా ఒక మూవీ చేస్తోంది. ఇంకా చేతిలో వరసగా  రెండు మూడు  తెలుగు మూవీస్ ఉన్నాయట. దాంతో ఈ అమ్మడు అర్జంట్ గా తెలుగు నేర్చుకుంటోందిట. తనకు తెలుగు భాష అంటే ఇష్టమని చెబుతున్న ఈ ముద్దు గుమ్మ తెలుగు  ఎలా మాట్లాడాలో ఆన్ లైన్ ద్వారా నేర్చుకుంటోందిట.

 

లాక్ డౌన్ టైం ని ఈ విధంగా సద్వినియోగం చేసుకుంటున్న ఈ అమ్మడు మరో వైపు బాలీవుడ్ వైపు కూడా చూస్తోందిట. తెలుగులో బిజీ అవుతూనే అటు బాలీవుడ్ లో కూడా జెండా పాతాలని అనుకుంటోందిట. ఇవన్నీ ఇలా ఉంటే తనకు సరైన పాత్ర తగిలితే గ్లామర్ ఒలకబోయడానికి ఎటువంటి అభ్యంతరం లేదని కూడా ఈ అమ్మడు చెబుతోంది. మరి అటువంటి పాత్రతో డైరెక్టర్ అప్రోచ్ అయితే అందాలు చూస్తే చాన్స్ ఇక ఆడియన్స్ దే.

 

అపుడు చూడాలి రూహానీ కహానీ ఏంటో అంటున్నారు యూత్ ఫ్యాన్స్. మొత్తం మీద రూహానీ శ‌ర్మ నార్త్ నుంచి సౌత్ కి వచ్చి తెలుగు నేర్చుకుని ఇక్కడ సత్తా చూపాలనుకోవడం నిజంగా గ్రేట్ అని చెప్పుకోవాలి.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: