పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ వకీల్ సాబ్. బాలీవుడ్ హిట్ సినిమా పింక్ కి అఫీషియల్ రీమేక్ గా తెరకెక్కుతుంది. శ్రీవెంకటేశ్వర క్రియోషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తుండగా బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్ ఈ సినిమాకి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. శృతిహాసన్ హీరోయిన్ గా ఇస్తుండగా నివేదా థామస్, అంజలి, అనన్య నాగల్ల, ప్రకాశ్ రాజ్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. 

 

వేణు శ్రీరాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా దాదాపు టాకీ పార్ట్ కంప్లీట్ చేసుకుంది. ఒక సాంగ్ కొన్ని సీన్స్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్న ఈ సినిమాకి పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలన్ని కలిపి ఒక నెల వర్క్ మాత్రమే బ్యాలెన్స్ ఉందని దర్శకుడు రీసెంట్ గా క్లారిటి ఇచ్చాడు. లాక్ డౌన్ తర్వాత బ్యాలెన్స్ వర్క్ కంప్లీట్ చేసి స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15 న రిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. జూలై నుండి ప్రమోషన్స్ ని మొదలు పెట్టే అవకాశాలున్నాయని తెలుస్తుంది. అయితే జనాలు థియోటర్స్ కి వస్తారా రారా అన్న క్లారిటి వచ్చాకే రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు కూడా. అలా అయితే మరో నెల కూడా డిలే అయ్యో అవకాశాలున్నాయి. 

 

ఇక అందరికంటే థమన్ మ్యూజిక్ ఈ సినిమాకి చాలా ఇంపార్టెంట్ అని మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా ఈ సినిమాకి బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా ముఖ్యం. అయితే థమన్ ఆర్ ఆర్ విషయంలో కింగ్. కాని సాంగ్స్ విషయంలోనే జాగ్రత్త తీసుకోవాలని అంటున్నారు. ఈ సినిమాకి మొదటిసారి పవన్ కళ్యాణ్ తో కలిసి పనిచేస్తున్నాడు థమన్. ఇప్పటికే వకీల్ సాబ్ నుంచి మగువా సాంగ్ రిలీజై పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. కాని ఫ్యాన్స్ ఆశించిన స్థాయిలో మాత్రం లేదని ఫ్యాన్స్ అభిప్రాయపడ్డారు. ఇక ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ సినిమాకి మ్యూజిక్ పెద్ద హిట్ గా నిలిచింది. అది దేవీశ్రీ ప్రసాద్ అయినా మణిశర్మ అయినా. కాని ఆ స్థాయిలో థమన్ మ్యూజిక్ ఉండకపోతే వకీల్ సాబ్ కి దెబ్బ పడే అవకాశం ఉందని మాట్లాడుకుంటున్నారు. దీన్ని బట్టి చూస్తే వకీల్ సాబ్ కి థమన్ ఎంత కీలకమో అర్థమవుతుంది.   

 

మరింత సమాచారం తెలుసుకోండి: