దర్శకుడిగా శంకర్ టాలెంట్ ఏంటో ప్రపంచం అంతా తెలిసిందే. సోషల్ ఇష్యూ కి కంప్లీట్ కమర్షియల్ సినిమాగా తీర్చిదిద్ది రికార్డ్స్ క్రియోట్ చేశారు. ఆయన తీసిన సినిమాలలో బాయ్స్, 3 ఇడియట్స్, ఐ, రోబో 2 వంటి సినిమాలు మాత్రమే నిరాశపరచాయి. జెంటిల్ మాన్, జీన్స్, ప్రేమికుడు, భారతీయుడు, ఒకే ఒక్కడు, శివాజి, అపరిచితుడు, రోబో, రోబో 2 లాంటి హిస్టరీ క్రియోట్ చేసిన సినిమాలని తెరకెక్కించారు.

 

ప్రస్తుతం శంకర్ కమల్ హాసన్ తో భారతీయుడు 2 ని తెరకెక్కిస్తున్నారు. ఇక గత కొన్ని రోజులుగా మెగాస్టార్ చిరంజీవి - శంకర్ కాంబినేషన్ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమా రాబోతుందని వార్తలు వస్తున్నాయి. చిరంజీవి రీ ఎంట్రీ సినిమా ఖైదీ నంబర్ 150 నుంచే ఈ కాంబినేషన్ మీద వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటి వరకు అటు శంకర్ గాని, ఇటు చిరంజీవి గాని ఎప్పుడు బహిరంగంగా వెల్లడించలేదు. కాకపోతే ఇద్దరు కలిసి సినిమా చేయాలని మాత్రం గతంలో ఒకటి రెండు సార్లు చర్చలు జరిగినట్టు చెప్పుకున్నారు. 

 

అందుకు ముఖ్య కారణం మాత్రం సూపర్ స్టార్ రజనీకాంత్ అని చెప్పాలి. రోబో సినిమా తెలుగు వర్షన్ ప్రమోషన్స్ నిర్వహించినప్పుడు ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా రజనీకాంత్ మాట్లాడుతు చిరంజీని శంకర్ దర్శకత్వంలో నటించమని ప్రత్యేకంగా కోరారు. అందుకు కారణం కూడా చెప్పారు. మీరు సౌత్ లోనే నంబర్ 1 డాన్సర్. మీలా ఇండస్ట్రీలో ఇంకెవరూ డాన్స్ చేయలేరు.

 

అలాగే మీ అంత గొప్పగా ఎవరూ నటించలేరన్నది నా అభిప్రాయం అంటూ వెల్లడించారు. రజనీకాంత్ చెప్పడం మాత్రం చెప్పారు గాని చిరంజీవి శంకర్ కాంబినేషన్ లో సినిమా మాత్రం కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం వస్తున్నవి మాత్రం పూర్తిగా గాసిప్స్ అని మాత్రం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: