ప్రముఖ టాలీవుడ్ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం దిల్ రాజు, బోనీ కపూర్ నిర్మాతలుగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కుతున్న కోర్ట్ డ్రామా మూవీ వకీల్ సాబ్ తో పాటు మరోవైపు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఒక పీరియాడికల్ సినిమాలను చేస్తున్నారు. కాగా ఈ రెండు సినిమాలు కూడా వేటికవే వైవిధ్యమైన జానర్లలో రూపొందుతున్నవి కావడం విశేషం. ఇక రెండేళ్ల క్రితం త్రివిక్రమ్ దర్శకత్వం లో వచ్చిన అజ్ఞాతవాసి అనంతరం కొన్నాళ్లపాటు సినిమాలకు విరామం ప్రకటించి తన రాజకీయ జీవితంలో నిమగ్నమైన పవన్, మళ్ళి సినిమాల్లో నటిస్తుండడంతో ఆయన ఫ్యాన్స్ అమితానందాన్ని వ్యక్తం చేస్తున్నారు. 

IHG's <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=LOVE' target='_blank' title='love-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>love</a> For Akhil

మొదటగా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో హీరోగా టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ ప్రస్థానం మొదలైంది. ముందుగా చిరంజీవి సోదరుడిగా పరిచయమైన పవన్, ఆపై వరుసగా వస్తున్న అవకాశాలు వినియోగించుకుని నటుడిగా పలు సక్సెస్ లతో పాటు ఎంతో క్రేజ్, ఎందరో అభిమానులను సంపాదించుకుని నేడు టాలీవుడ్ గర్వించదగ్గ గొప్ప నటులలో ఒకరిగా మారారు పవన్. ఇకపోతే పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి వచ్చే ముందుగా ఆయనను ఎంతో ప్రోత్సహించిన వ్యక్తి ఆయన వదిన అయిన సురేఖ అని గతంలో పలు సందర్భాల్లో పవన్ చెప్పడం జరిగింది. 

 

ముందుగా తాను సినిమాల్లోకి వస్తాను అన్నపుడు అన్నయ్య చిరంజీవి ఎంతో సపోర్ట్ చేసి, తనకు నటనలో పలు మెళకువలు నేర్పడంతో పాటు సత్యానంద్ గారితో ప్రత్యేకంగా మాట్లాడి శిక్షణనిప్పించడం జరిగిందని, అయితే ఆ సమయంలో తనను మానసికంగా ఎంతో దృఢంగా, ధైర్యంగా తయారు చేయడంతో పాటు, నటుడిగా తప్పకుండా మంచి పేరు దక్కించుకుంటావు అని ఎంతో ప్రోత్సహించింది మాత్రం వదిన సురేఖని, అందుకే ఆమెను తల్లిగానే భావిస్తానని అంటుంటారు పవన్. అలానే అన్నయ్య పెళ్లి తరువాత నుండి అమ్మవంటి వదిన మీద తనకు ఎంతో అభిమానం ఉండేదని, అలానే వదిన కూడా తనని కన్నబిడ్డ మాదిరి చూసుకునేవారని పవన్ చెప్తుంటారు. అందుకే తనకు ఇంతగొప్ప పేరు ప్రఖ్యాతలు రావడానికి అన్నయ్య తో పాటు వదిన కూడా కారణమని పవన్ చెప్పడం జరిగింది.....!!! 

మరింత సమాచారం తెలుసుకోండి: