ప్రస్తుతం పలు ఇతర దేశాలతో పాటు కరోనా వ్యాధి భయంతో మన దేశాన్ని కూడా దాదాపుగా 40 రోజులకు పైగా లాక్ చేయడం జరిగింది. అయితే ఈ విధంగా లాక్ డౌన్ చేయడం వలన ఎక్కడి ప్రజలు అక్కడే తమ తమ ఇళ్లకు పరిమితం అయి వారి మధ్య సోషల్ డిస్టెన్సింగ్ పెరిగి కరోనా మరింతగా వ్యాప్తి కాకుండా ఉంటుందని పలు ప్రభుత్వాలు ఈ విధమైన చర్యలు చేపట్టాయి. అయితే ఈ లాక్ డౌన్ వలన అన్ని రంగాలు కూడా పూర్తిగా మూతబడడంతో ఆర్ధిక మాంద్యం పై దీని ప్రభావం విపరీతంగా పడడం జరుగుతోంది. దానితో పాటు అనేకమంది ప్రజలు తమ ఇళ్ళు దాటి బయటకు వెళ్లి పనులు చేసేందుకు వీలు లేకపోవడంతో కనీసం తినడానికి తిండి కూడా లేని పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. 

 

దీనితో కేంద్రంతో పాటు పలు రాష్ట్ర ప్రభుత్వాలు అటువంటి వారికి రేషన్ తో పాటు కొంత నగదును కూడా ఆర్ధిక సాయంగా ప్రకటించడం జరిగింది. అలానే పలువురు ప్రముఖులు కూడా ముందుకు వచ్చి తమవంతుగా విరాళాలు అందించడం జరుగుతోంది. ఇక రెండు రోజుల క్రితం ఈ లాక్ డౌన్ లో కొంత మార్పులు చేర్పు చేస్తూ కేంద్రం కొద్దిపాటి మార్గదర్శకాలను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ ప్రకారం దేశంలోని రాష్ట్రాలను, జిల్లాలను, ప్రాంతాలను రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా విభజించడం జరిగింది. కరోనా ప్రభావం అత్యధికంగా ఉన్న ప్రాంతాలను రెడ్ జోన్లుగా, అలానే ఒకింత తక్కువగా ఉన్న ప్రాంతాలను ఆరెంజ్ జోన్లుగా, అలానే పూర్తి గా కరోనా ప్రభావం లేని ప్రాంతాలను గ్రీన్ జోన్లుగా ప్రకటించడం జరిగింది. 

 

అలానే దానితో పాటు కొన్ని రాష్ట్రాల్లో అవసరాన్ని బట్టి లిక్కర్ షాపులను కూడా తెరుచుకోవచ్చని ప్రకటించడంతో మన దేశంలో కొన్ని రాష్ట్రాల్లో లిక్కర్ షాప్ లు తెరుచుకున్నాయి. దానితో ఎక్కడికక్కడ ప్రజలు విపరీతంగా మద్యం షాపులకు క్యూలు కడుతున్నారు. ఇకపోతే టాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ సింగ్ కి సంబంధించి ఒక వీడియో నిన్న మధ్యాహ్నం నుండి పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఆ వీడియో లో గమనించినట్లయితే రకుల్ తన చేతిలో మందులు వంటివి పట్టుకుని వెళ్తున్నట్లు గమనించవచ్చు. అయితే ఆమె చేతిలో ఉంది మద్యం అని కొందరు సోషల్ మీడియాలో పుకార్లు లేవనెత్తడం జరిగింది. అదంతా ఒట్టి పుకారు మాత్రమే అని, కొందరు గిట్టనివారు తమ హీరోయిన్ పై కావాలనే బురదజల్లాలని ఆ విధంగా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని, తమ ఇంట్లో అవసరమై ఆమె మెడికల్ షాప్ లో మందులు కొనుగోలు చేసినట్లు చెప్తున్నారు రకుల్ ఫ్యాన్స్. అయితే ఈ విషయమై డైరెక్ట్ గా రకుల్ స్పందిస్తేనే కానీ పూర్తిగా వాస్తవాలు బయటకు వచ్చేలా కనపడడం లేదు.....!!! 

మరింత సమాచారం తెలుసుకోండి: