ముందుగా భీభత్సం సినిమా ద్వారా టాలీవుడ్ కి సంగీత దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన యువ సంగీత తరంగం ఎస్ ఎస్ థమన్, ఆ తరువాత రవితేజ హీరోగా సురేందర్ రెడ్డి తెరకెక్కించిన కిక్ సినిమాకు అడిగిపోయే సాంగ్స్ ఇచ్చి కెరీర్ పరంగా ఫస్ట్ బ్రేక్ ని అందుకున్నాడు. ఆ తరువాత వైశాలి, బృందావనం, మిరపకాయ్, దూకుడు, రగడ సినిమాలకు మంచి మ్యూజిక్ అందించి పేరు సంపాదించిన థమన్, ఆ తరువాత నుండి మెల్లగా ఒక్కొక్కటిగా అవకాశాలతో ముందుకు సాగాడు. ఒకానొక సమయంలో చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అనేక సినిమాలకు వరుసగా ఛాన్స్ లు అందుకున్న తమన్, ఆపై వచ్చిన బిజినెస్ మ్యాన్, బాడీ గార్డ్, లవ్ ఫెయిల్యూర్, నాయక్, గ్రీకు వీరుడు, బాద్షా, బలుపు వంటి సినిమాలకు పని చేసాడు. అయితే అప్పట్లో థమన్ మ్యూజిక్ పై ఒక పెద్ద కంప్లైంట్ ఉండేది. 

 

అదేమిటంటే, ఇచ్చిన ట్యూన్స్ నే ఎక్కువగా తిప్పి తిప్పి మళ్ళి మళ్ళి తన సినిమాలకే కంపోజ్ చేస్తున్నాడు అంటూ కొందరు ప్రేక్షకులు థమన్ పై విమర్శలు చేయడం మొదలెట్టారు. కాగా ఆ తరువాత బన్నీ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన సరైనోడు సినిమా అనంతరం కొంత గ్యాప్ తీసుకున్న థమన్, ఆ తరువాత శర్వానంద్, మారుతీల కలయికలో వచ్చిన మహానుభావుడు సినిమాతో రీఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఇక ఆ సినిమా నుండి పూర్తిగా తన ట్యూన్స్ లో ఎంతో మార్పు కనబరచడంతో పాటు అదిరిపోయే సాంగ్స్ ని ఇస్తూ ముందుకు సాగుతున్న థమన్, ఇటీవల స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో తెరకెక్కిన అలవైకుంఠపురములో సినిమాకు కంపోజ్ చేసిన సాంగ్స్ తో నేషనల్ రేంజ్ ఇమేజ్ ని దక్కించుకున్నాడనే చెప్పాలి. 

IHG

ఇక ప్రస్తుతం తమన్ చేతిలో చాలానే ప్రాజక్ట్స్ ఉన్నాయి. ఇటీవల దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకుడిగా 20 ఏళ్ళు సక్సెస్ఫుల్ గా పూర్తి చేసుకున్న సమయంలో థమన్ ట్వీట్ చేస్తూ, సర్ పూరి గారు మనం మహేష్ గారితో కలిసి గతంలో బిజినెస్ మ్యాన్ చేసాము, అలానే మనం మళ్ళి కలిసి బిజినెస్ మ్యాన్ 2 సినిమా చేయాలని, ఎప్పుడు స్క్రిప్ట్ మొదలెడుతున్నారో చెప్పండి అంటూ పోస్ట్ చేయడం జరిగింది. బ్రదర్ థమన్, మా సూపర్ స్టార్ ఫ్యాన్స్ లో ఆశలు రేపుతున్నావు, తప్పకుండా మా సూపర్ స్టార్ తో నువ్వు బిజినెస్ మ్యాన్ 2 సినిమాకి పని చేయాలి, అలానే ఆ సినిమాకి సాంగ్స్ అదరగొట్టాలని, గతంలో మహేష్ నటించిన దూకుడు, బిజినెస్ మ్యాన్ సినిమాలకు మంచి మ్యూజిక్ ఇచ్చిన నువ్వు, అన్నిటినీ మించేలా అదరగొడుతూ బిజినెస్ మ్యాన్ 2 కు మ్యూజిక్ ఇవ్వాలి అనేది మా ఉద్దేశం అంటూ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా పలువురు మహేష్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు....!!!

మరింత సమాచారం తెలుసుకోండి: