టాలీవుడ్ లో అయినా తమిళంలో అయినా సరే తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ రమ్యకృష్ణ అనేది వాస్తవం. ఆమె చేసిన కొన్ని సినిమాలు ఆమె కెరీర్ ని ఎక్కడో నిలబెట్టాయి అనేది వాస్తవం. అగ్ర హీరోలతో ఆమె చేసిన సినిమాలు ఆమె రేంజ్ ని భారీగా పెంచాయి అనేది వాస్తవం. చిన్న హీరోలు అయినా పెద్ద హీరోలు అయినా సరే రమ్య ఉంది అంటే చాలు ప్రేక్షకులు అలా చూస్తూ ఉంటారని అంటారు. ఆమె చేసిన కొన్ని సినిమాలు అయితే ఇప్పటికి కూడా ఆదరణ ఉన్న సినిమాలే అనేది అందరికి తెలుసు. 

 

ఆమె కెరీర్ లో ప్రత్యేకంగా చెప్పుకునే సినిమా ఏది అయినా ఉందీ అంటే నరసింహ. ఈ సినిమా కు ముందు రమ్యకృష్ణ వేరు ఈ సినిమా తర్వాత రమ్యకృష్ణ వేరు అని టాలీవుడ్ వర్గాలతో పాటు తమిళ సినిమా వర్గాలు కూడా వ్యాఖ్యలు చేసిన సందర్భాలు ఉన్నాయి అనేది వాస్తవం. ఆమె ఆ సినిమాలో చేసిన యాక్షన్ ని చూసి బాలీవుడ్ కూడా ఫిదా అయిపోయింది. ఇండియన్ సినిమాలో ఒక లేడీ విలన్ ఒక సూపర్ స్టార్ పక్కన ఆ విధంగా నటించడం అనేది మొదటి సారి. అక్కడి నుంచి ఆమె రేంజ్ ఒక స్థాయిలో పెరిగిపోయింది. 

 

ఆమె తో సినిమా చెయ్యాలి అనుకుని ఎదురు చూసిన హీరోలు ఎందరో ఉన్నారు. ఆమె తో ఒక్క అవకాశం వచ్చినా చాలు అనుకునే స్టార్ హీరోలు కూడా ఆ సమయంలో ఉన్నారు. ఆమె నటన ఆమె హావభావాలు ఆమె చూపులు అన్నీ కూడా ప్రేక్షకులకు ఆ సినిమా తర్వాత పిచ్చి ఎక్కించాయి అనేది వాస్తవం. ఆ సినిమా తర్వాత ఆమెకు పారితోషికం కూడా నిర్మాతలే స్వయంగా పెంచారు అనేది తెలిసిందే. ఆమె అయితే చాలా రోజు లు చెన్నై వెళ్ళలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: