మహేష్ బాబు హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం పోకిరి. విడుదలై దాదాపు 14 ఏళ్ళు అవుతున్నా సరే ఈ సినిమా అభిమానులను ఇంకా ఆకట్టుకుంటూ నే ఉంటుంది. ఈ సినిమా టీవీ లో వస్తే ప్రేక్షకులు ఇంకా ఆదరిస్తూ ఉంటారు. ఈ సినిమా మహేష్ బాబు కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది అనేది వాస్తవం. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు వెనక్కు తిరిగి చూసుకునే అవసరం రాలేదు. అంతకు ముందు అతను చేసిన అర్జున్ సినిమా కంటే ఈ సినిమా బాగా అతనికి ప్లస్ అయింది అనేది వాస్తవం. ఎన్నో రికార్డులు బద్దలు కొట్టింది ఈ సినిమా. 

 

ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన ఇలియానా కు మంచి గుర్తింపు వచ్చింది. అక్కడి నుంచి ఆమె స్టార్ హీరోయిన్ అయిపోయింది. టాలీవుడ్ అగ్ర దర్శక నిర్మాతలు ఆమెకు అవకాశాలు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. అక్కడి నుంచి ఆమె ఒక వెలుగు వెలిగింది. అగ్ర హీరోలతో సినిమాలు చేసే అవకాశాలు ఆమెకు వచ్చాయి. పవన్ కళ్యాణ్ తో జూనియర్ ఎన్టీఆర్ తో ఆమె సినిమాలు చేసింది. హిట్ అయినా ఫ్లాప్ అయినా ఆమెకు మాత్రం అక్కడి  నుంచి మంచి పేరు వచ్చింది అనేది వాస్తవం. 

 

ఇప్పుడు ఆమె కెరీర్ లో ఇబ్బంది పడుతున్నా సరే ఆమె మాత్రం పోకిరి సినిమా తర్వాత యూత్ కి బాగా దగ్గరైంది అనేది వాస్తవం. ఆమె అక్కడి నుంచి ఇక బాలీవుడ్ మీద కూడా దృష్టి పెట్టాలి అని చూసినా పెద్దగా ఫలించలేదు అని చెప్పవచ్చు. ప్రస్తుతం ఆమె ఒకటి రెండు సినిమాల్లో నటిస్తుంది గాని అవేమి పెద్ద సినిమాలు కాదు. ఇప్పుడు ఒక్క మంచి హిట్ వచ్చినా చాలు అనుకునే పరిస్థితిలో ఆమె ఉంది అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: