ప్రస్తుతం తెలుగులో ఉన్న చాలా మంది స్టార్ హీరోయిన్ లు అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు ముఖ్యంగా సీనియర్ హీరోయిన్ లు అయితే ఒక్క అవకాశం వచ్చినా చాలు అనుకునే పరిస్థితిలో ఉన్నారు అనేది అందరికి తెలిసిందే. అయితే నయనతార కు మాత్రం అలాంటి పరిస్థితి దాదాపుగా లేదు. ఆమె కోసం దర్శక నిర్మాతలు అటు తమిళంలో అయినా ఇటు తెలుగులో అయినా సరే ఎదురు చూస్తూ ఆమె చేస్తాను అంటే మంచి పాత్రలు ఇవ్వాలి అనే భావన లోనే ఉన్నారు. ఆమె ప్రస్తుతం తెలుగులో అయినా తమిళంలో అయినా మంచి డిమాండ్ ఉన్న హీరోయిన్.

 

ఆమె చేసిన సినిమాలు ఈ మధ్య కాలంలో ఏ హీరోయిన్ కూడా చేయలేదు అనేది తెలిసిందే. అయితే ఆమె కెరీర్ లో బాగా ప్లస్ అయిన సినిమా సింహా. సింహా సినిమా తర్వాత ఆమె వెనక్కు తిరిగి చూసుకునే అవసరం రాలేదు అని టాలీవుడ్ వర్గాలు అంటాయి. ఆమె అక్కడి నుంచి వరుస ఆఫర్లతో దూసుకుపోయింది. ఆ సినిమాలో ఆమె బాలకృష్ణ పక్కన హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా అటు బాలకృష్ణ కు ఆమెకు కూడా బిగ్గెస్ట్ హిట్ అనే సంగతి తెలిసిందే. అక్కడి నుంచి ఆమె అసలు వెనక్కు తిరిగి చూసుకోలేదు. 

 

దర్శక నిర్మాతలు ఆమెకు పిలిచి అవకాశాలు ఇచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని చెప్తూ ఉంటారు. ఆమె అక్కడి నుంచి చాలా మంది స్టార్ హీరోలతో సినిమాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. తమిళంలో అయితే ఆమె సినిమా వస్తుంది అంటే చాలు ప్రేక్షకులు ఆశగా ఎదురు చూడటం మొదలుపెట్టారు. ఆమె అందానికి ఇప్పటికి కూడా ఫాన్స్ ఉన్నారు. నేటి తరం ఫాన్స్ ని కూడా ఆమె ఆకట్టుకుంది తన అందం తో అనేది వాస్తవం.

మరింత సమాచారం తెలుసుకోండి: