టాలీవుడ్ లో కొందరు హీరోయిన్ లు బాగా గుర్తుండి పోయారు ప్రేక్షకులకు. చిన్న చిన్న సినిమాలు చేసినా పెద్ద సినిమాలు చేసినా సరే వారి తో సినిమాలు చేయడానికి చాలా మంది హీరోలు దర్శకులు ఎదురు చూసిన సందర్భాలు ఉన్నాయి అనేది వాస్తవ౦. అగ్ర హీరోలతో సినిమాలు చేసినా చిన్న హీరోలతో సినిమాలు చేసినా సరే వారికి ఉన్న స్టార్ హీరోయిన్ హోదా మాత్రం అలాగే నిలబడింది అనేది వాస్తవం. అందులో ప్రధానంగా చెప్పుకునే హీరోయిన్ మీనా. మీనా సినిమా అంటే ఒక రేంజ్ ఉండేది అప్పట్లో. 

 

ఆమె సినిమాలో ఉంది అంటే చాలు సినిమా హిట్ అనే భావన లో దర్శక నిర్మాతలు కూడా ఉండే వారు. ఇక ఆమె చేసిన కొన్ని సినిమాలు ఆమెకు నటన పరంగా చాలా మంచి గుర్తింపు తీసుకొచ్చాయి అనేది వాస్తవం. వెంకటేష్ తో ఆమె చేసిన సినిమాలు ఆమెకు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. ఇక ఆమె సోలో గా చేసిన సినిమాలు కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. అందులో ప్రధానంగా చెప్పుకునే సినిమా సీతారామయ్య గారి మనువరాలు. అక్కినేని నటించిన ఈ సినిమా ఆమె కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా చెప్పుకోవచ్చు. 

 

ఆ సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆమె ఆ సినిమా తర్వాత పారితోషికం పెంచకపోయినా సరే దర్శక నిర్మాతలు మాత్రం ఆమెకు పారితోషికం పెంచారు. ఇక ఇది ఇలా ఉంటే ఆమె కెరీర్ లో వచ్చిన... చంటి సినిమా కూడా ఆమెకు బాగా ప్లస్ అయింది. ఆ సినిమాలో హీరో గా వెంకటేష్ నటించారు. ఆమె నటన కు ఆ సినిమాలో కూడా మంచి మార్కులు పడ్డాయి. అక్కడి నుంచి ఆమె వెనక్కు తిరిగి చూసుకునే అవసరం రాలేదు అని టాలీవుడ్ వర్గాలు  చెప్పాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: