కరోనా ప్రభావంతో ఇళ్లకే పరిమితమైన సెలబ్రిటీలు తమ క్వారెంటైన్‌ టైంను అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు. దేశ విదేశాల్లో ఉన్న అందరు తారలు ప్రస్తుతం ఇదే పనుల్లో ఉన్నారు. ఎక్కువ ఖాళీ సమయం దొరకటంతో అభిమానులతో ఇంటరాక్ట్ అవుతున్నారు. ఈ ఫ్రీ టైంను ఎలా స్పెండ్ చేస్తున్నారో అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా కూడా తన క్వారెంటైన్‌ డైరీస్‌ను అభిమానులతో షేర్ చేసుకుంది.

 

తాజాగా ఈ భామ తన పెట్ డాక్‌ గినోను కౌగిలించుకున్న ఫోటోను సోషల్ మీడియా పేజ్‌లో షేర్ చేసింది. ఈ ఫోటోతో పాటు `నిజంగా చెపుతున్న గినో నా కౌగిలిని ఇష్టపడుతుంది` అంటూ కామెంట్ చేసింది. గతంలో ప్రియాంక తన కోడలు కృష్ణ తనను ప్రిన్సెస్‌లా రెడీ చేస్తున్న ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంది. ఈ క్వారెంటైన్‌ సమయాన్ని తన భర్తతో కలిసి ఎంజాయ్ చేస్తోంది ప్రియాంక.

 

ఇక తన భర్తతో కలిసి కరోనా పోరాటానికి భారీ ఆర్థిక సాయం ప్రకటించింది ప్రియాంక చోప్రా. ప్రధాన మంత్రి సహాయ నిధితో పాటు యునిసెఫ్, ఫీడింగ్ అమెరికా లాంటి చాలా సంస్థలకు వీరు ఆర్థిక సాయం అంధించారు. అంతేకాదు మరో లక్ష డాలర్లు ఈ కష్టకాలంలో సేవలందిస్తున్న మహిళ కోసం ఖర్చు పెట్టాలని ప్రియాంక నిర్ణయించుకుంది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

I promise Gino loves my cuddles. @ginothegerman

A post shared by priyanka chopra Jonas (@priyankachopra) on

మరింత సమాచారం తెలుసుకోండి: