మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహారెడ్డి సినిమా తర్వాత వరుసగా సినిమాలు ఒప్పుకుంటున్నాడు. తొమ్మిదేళ్లపాటు రాజకీయాల్లో ఉన్న చిరంజీవి ఖైదీ నంబర్ ౧౫౦ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి బాక్సాఫీసుని షేక్ చేశాడు. దాంతో ఎప్పటి నుండో చేద్దామనుకుంటున్న సైరా సినిమాని పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కించాడు. ఈ సినిమా తెలుగు మినహా ఇతర భాషల్లో యావరేజ్ గా నిలిచింది.

 

 

ఇకపోతే ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమా చేస్తున్నాడు. మిర్చి సినిమాతో దర్శకుడిగా మారిన కొరటాల, ఇప్పటి వరకు చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్లే. సందేశాన్ని కమర్షియల్ హంగులతో చాలా చెప్పే కొరటాల, ఆచార్య సినిమాకి కూడా సందేశాత్మక చిత్రంగానే తీర్చిదిద్దుతున్నాడట. ఈ సినిమాలో రామ్ చరణ్ ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

 

 

ఇదిలా ఉంటే ఈ సినిమా అనంతరం మెగాస్టార్ మళయాల చిత్రమైన లూసిఫర్ రీమేక్ లో నటిస్తున్నాడు. సాహో సినిమాతో డిజాస్టర్ ని మూటగట్టుకున్న సుజిత్సినిమా స్క్రిప్టుని సిద్ధం చేసే పనిలో ఉన్నాడు. అయితే లూసిఫర్ అనంతరం మెగాస్టార్, ఇండియన్ జేమ్స్ కామెరూన్ గా పిలుచుకునే శంకర్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడనే వార్త హల్చల్ చేస్తుంది.

 

 

శంకర్ దర్శకత్వంలో సినిమా చేయాలని చిరంజీవికి ఎప్పటి నుండో ఆశ ఉంది. కానీ అది ఇప్పటి వరకూ తీరలేదు. ప్రస్తుతం కమల్ హాసన్ తో ఇండియన్ ౨ సినిమాని తీస్తున్నాడు. అనేక కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది.  మళ్లీ ఎన్నాళ్ళకి మొదలవుతుందో తెలియదు. కరోనా కారణంగా మెగాస్టార్ ఆచార్య ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేని పరిస్థితి. మరి చిరంజీవి, శంకర్ ల కాంబినేషన్లో సినిమా అనేది వట్టి పుకారేనా అన్నది అనుమానంగా ఉంది.

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: