యాంకర్ గా సూపర్ ఫామ్ లో ఉన్న అనసూయ సినిమాల్లో కూడా సత్తా చాటుతుంది. క్షణం సినిమాతో వెండితెర మీద తన అదృష్టాన్ని పరీక్షించుకున్న అనసూయసినిమా నుండి వచ్చిన ఛాన్సులు చేస్తుంది. అయితే తనకు వచ్చిన ప్రతి ఆఫర్ చేయకుండా డిఫరెంట్ సినిమాలు చేస్తుంది అనసూయ. లేటెస్ట్ గా అనసూయ ఆచార్య సినిమాలో నటిస్తుందని తెలుస్తుంది. మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న క్రేజీ మూవీ ఆచార్య. ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా నటిస్తున్నాడని తెలుస్తుంది. 

 

చిరు, చరణ్ ఒకేసారి స్క్రీన్ పై కనబడితే ఆ లెక్క వేరేలా ఉంటుంది. ఆచార్య సినిమాలో అదే మ్యాజిక్ రిపీట్ అవబోతుందని అంటున్నారు. ఇక సినిమాలో హాట్ యాంకర్ అనసూయకు లక్కీ ఛాన్స్ వచ్చిందట. సినిమాలో చిరుతో పాటుగా స్పెషల్ సాంగ్ లో రెజీనా నటిస్తుండగా.. చరణ్ కు జోడీగా అనసూయ ఆడి పడుతుందని తెలుస్తుంది. ఆచార్యలో అనసూయ అందాలు కూడా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తాయని అంటున్నారు. మెగా హీరోల సినిమాల్లో అనసూయ లక్కీ గా మారింది. 

 

సాయి తేజ్ విన్నర్ సినిమాలో స్పెషల్ సాంగ్ లో కనిపించిన అనసూయ రామ్ చరణ్ రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రలో అదరగొట్టింది. ఇక ఇప్పుడు ఆచార్య సినిమాలో కూడా చరణ్ తో పాటుగా తన డ్యాన్స్ తో దుమ్ముదులిపేస్తుందని అంటున్నారు. మొత్తానికి కొరటాల శివ మెగా ప్లానింగ్ తో మెగా ఫ్యాన్స్ ను మెప్పించేలా ఉన్నాడు. సినిమాలో చరణ్, చిరు ఇద్దరు నక్సలైట్ గా కనిపిస్తారని టాక్. 2021 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. స్మాల్ స్క్రీన్, సిల్వర్ స్క్రీన్ రెండిటిలో అనసూయ ఫామ్ మాత్రం అదరగొట్టేస్తుంది.     

మరింత సమాచారం తెలుసుకోండి: