పాయల్‌ రాజ్‌పుత్.. పెద్ద‌గా ప‌రిచ‌యం అవ‌స‌రంలేని పేరు. `ఆర్ఎక్స్ 100` సినిమా ద్వారా హీరోయిన్‌గా తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌కు ఎంట్రీ ఈ బ్యూటీని మ‌ర్చిపోవ‌డం అంత సులువు కాద‌నే చెప్పాలి. ఈ  చిత్రం ద్వారా గ్లామర్‌ తళుకులతో యువతరం హృదయాల్ని దోచుకుంది ఈ పంజాబీ ముద్దుగుమ్మ. కుర్రాళ్లకు ఆ సినిమాతో నిద్ర లేకుండా చేసింది. ముక్యంగా ఆ సినిమాలో ఆమె నటన ఒక సెన్సేషన్ అనే చెప్పుకోవాలి. నటన కంటే ఎక్కువగా ఆమె బోల్డ్ యాక్టింగ్, హీరోతో నిమిషాల తడబడి పెదాలతో ఆడిన ముద్దలాటకి అంతా ఫిదా అయ్యారు. ఆ సినిమాలో, అందాల ఆరబోతతో చాలామంది కుర్రాళ్లకు ఆమె హార్ట్ ఫేవరేట్‌గా మారిపోయింది. 

 

ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ శిష్యుడు అజయ్ భూపతి ద‌ర్శ‌క‌త్వంలో వ‌హించిన ఈ చిత్రంలో కార్తీకేయ హీరోగా న‌టించాడు. రిలీజ్‌కు ముందే భారీ అంచనాలను సొంత చేసుకొన్న ఈచిత్రం 2018 జూలై 12న విడుద‌లై ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంది. దర్శకుడు అజయ్ భూపతి నేటివిటి నేపథ్యంగా రాసుకొన్న ఈ కథ గ్రామీణ వాతావరణం అద్దం పట్టింది. గ్రామస్థాయి రాజకీయాలు, ఊర్లలో ఉండే నాటు సరసం, ప్రేమను చక్కగా ఒడిసిపట్టుకొని అద్భుతంగా దర్శకుడు తెరకెక్కించాడు. ఇక పాయల్ రాజ్‌పుత్ పోషించిన `ఇందు` పాత్ర ఈ మధ్య తెలుగు సినిమాల్లో చూసి ఉండకపోవచ్చ‌నే చెప్పాలి.

 

ఎప్పుడూ హీరోయిన్లు పాటలకు, అందాల ఆరబోతకే పరిమితవుతున్నారనే విమర్శకు చెక్ పెట్టే విధంగా ఈ సినిమాలో పాయ‌ల్‌ పాత్ర ఉంటుంది. ఇక క్యారెక్టర్‌కు తగినట్టే పాయల్ ఆ పాత్రలో జీవించేసింది. ఈమె న‌ట‌న‌ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లిందనే చెప్పవచ్చు. క్లైమాక్స్‌లో పాయల్ చూపించిన హావభావాలు ప్రేక్షకుడికి కొత్త అనుభూతిని అందించింది. మొత్తంగా చెప్పాలంటే పాయ‌ల్ ఈ సినిమాలో అన్ని కోణాలు చూపించేసింది. ఇక‌ ఈ సినిమా సూప‌ర్ హిట్ అవ్వ‌డంతో పాయ‌ల్ క్రేజ్ విప‌రీతంగా పెరిగిపోయింది. అయితే ఆ త‌ర్వాత కొన్ని ఫ్లాప్స్ వ‌చ్చిన‌‌ప్ప‌టికీ.. ప్ర‌స్తుతం ఈ బ్యూటి త‌మిళంతో పాటు తెలుగు సినిమాలు చేస్తూ మంచి జోరు మీదే కొన‌సాగుతోంది.

 
 
  

మరింత సమాచారం తెలుసుకోండి: