సినిమాల్లో నెవర్ బోరింగ్ సబ్జెక్ట్ అంటే అది లవ్ సబ్జెక్ట్ మాత్రమే. ప్రేమకథలు ఎన్ని రకాలుగా, ఎన్ని డిఫరెంట్ వేరియేషన్స్ లో తెరకెక్కించినా ప్రేక్షకాదరణ ఉంటుందని ఎన్నో సినిమాలు నిరూపించాయి. తెలుగులో వచ్చిన అనేక ప్రేమకథల్లో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ‘ఆర్య’ కు కూడా స్థానం ఉంటుంది. టాలెంటెడ్ డైరక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమా విడుదలై నేటితో 16 ఏళ్లు పూర్తయ్యాయి.

IHG

 

దర్శకుడిగా సుకుమార్ కు ఇది తొలి సినిమా. 2004 మే7వ తేదీన విడుదలైన ఈ సినిమా డిఫరెంట్ జోనర్ లో తెరకెక్కింది. ప్రేమికుడిగా అల్లు అర్జున్ నటన ఆకట్టుకుంటుంది. ప్రేమికుల మధ్య ఉండాల్సింది ప్రేమే కానీ ప్రేమిస్తున్నానుకోవడం కాదనేది ఈ సినిమా థీమ్. సుకుమార్ స్క్రీన్ ప్లే డిఫరెంట్ గా ఉంటుంది. కాలేజీలో హీరో తన హీరోయిజం చూపించే సీన్లు, ముందు నువ్వే నాకు ఐ లవ్ ఎందుకు చెప్పలేదురా.. అనే డైలాగులు సినిమాను ఎలివేట్ చేస్తాయి. గీత నన్ను ప్రేమిస్తుందా లేదా అంటూ బన్నీ.. కప్ లో రాళ్లు వేసే సీన్ సుకుమార్ డిఫరెంట్ రైటింగ్స్ కు నిదర్శనంగా నిలుస్తుంది.

IHG

 

దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్. పాటలన్నీ చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. ప్రేమకథల్లో మాసివ్ థీమ్ ఆర్యలో కనపబడుతుంది. బన్నీ కెరీర్లో ఇది రెండో సినిమా గా మాత్రమే కాకుండా తొలి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తొలి సినిమాతోనే సుకుమార్ టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ డైరక్టర్ గా మారిపోయాడు. దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కిన ఈ సినిమా 56 సెంటర్లలో 100 రోజులు రన్ అయింది. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా 125 రోజుల ఫంక్షన్ కూడా నిర్వహించారు.

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: