రాశి ఒక తెలుగులో హీరోయిన్‌గా న‌టించి ప్రేక్ష‌కుల గుండెల్లో చ‌ద‌ర‌ని ముద్ర వేసుకుంది. బాలనటిగా తెలుగు చిత్రసీమలో ప్రవేశించి నాయికగా గోకులంలో సీత, శుభాకాంక్షలు సినిమాలతో మంచి పేరు సంపాదించింది. తమిళంలో మంత్ర అనే పేరుతో నటించింది. శీను, సముద్రం, వెంకీ వంటి చిత్రాలలో కొన్ని శృంగార ప్రధాన ప్రత్యేక గీతాలలో కూడా ఈ భామ అప్ప‌ట్లో నటించింది. రెండు దశాబ్దాల క్రితం హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన రాశి.. ఆ తర్వాత తనదైన యాక్టింగ్‌తో ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసింది.  బాలనటిగా చాలా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ న‌టి.   వెంకటేష్‌తో క‌లిసి శ్రీనుచిత్రంలో ఒక పాటలో డాన్స్ చేసినట్టు తెలిపారు. మరోవైపు నేను బాలనటిగా బాలయ్యబాబుతో ‘బాల గోపాలుడు’ సినిమాలో న‌టించింది. ఆ తర్వాత ఆయనతో ‘కృష్ణబాబు’ సినిమాలో హీరోయిన్‌గా నటించింది.  పధ్నాలుగేళ్లకే రాశి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు.

 

అయితే ఆమెకు బ్రేక్ ఇచ్చిన చిత్రం మాత్రం ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌తో న‌టించిన `గోకులంలో సీత`. ఆ త‌రువాత జ‌గ‌ప‌తిబాబుతో క‌లిసి శుభాకాంక్ష‌లు చిత్రంలో న‌టించింది. ఆ చిత్రం కూడా రాశికి మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు తీసుకువ‌చ్చింద‌ని చెప్పాలి. ఇంకా పెళ్ళి పందిరి చిత్రంలో కూడా మంచి పేరు వ‌చ్చింది. ఇక ప‌వ‌న్‌తో క‌లిసి న‌టించిన చిత్రంలో రాశిని తీసుకోవ‌డానికి ప్ర‌ధాన కార‌ణం చిరంజీవి వైఫ్ సురేఖ అని చెప్పాలి. సురేఖ రాశి గ‌త చిత్రాలు చూసి ఇన్‌స్పైర్ అయింద‌ట‌. ఆమె ఎలాగైనా ప‌వ‌న్ ప‌క్క‌న న‌టించాల‌ని ప‌వ‌న్ ప‌క్క‌న హీరోయిన్‌గా తీసుకోమ‌ని సురేఖ రిక‌మండ్ చేశార‌ట‌. అలా ప‌వ‌న్ ప‌క్క‌న గోకులంలో సీత‌గా రాశి ప్రేక్ష‌కుల‌ను అల‌రించింది. అయితే ఈ చిత్రం మంచి సెంటిమెంట్‌తో ఉండ‌గా బిగ్ హిట్ కొట్టింద‌ని చెప్పాలి.  

 

ఆ త‌ర్వాత కూడా రాశి మ‌నసిచ్చి చూడు శ్రీ‌కాంత్‌తో క‌లిసి న‌టించింది. అందులో కూడా చాలా అద్భుత‌మైన పాత్ర‌లో న‌టిస్తుంది. ఫ్యామిలీ ఆడియ‌న్స్‌ని ఆ చిత్రం ద్వారా ఫుల్‌గా ఆక‌ట్టుకుంద‌ని చెప్పాలి. అప్ప‌ట్లో సౌంద‌ర్య త‌ర్వాత కాస్త ఫ్యామిలీ ఆడియ‌న్స్‌ని ఆక‌ట్టుకున్న హీరోయిన్ అంటే రాశి అని చెప్పాలి. ఇక వివాహం చేసుకున్న త‌ర్వాత సినిమాల్లో న‌టించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: