మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగు ఇండస్ట్రీ లో మకుటం లేని మహారాజుల్లా కొనసాగుతున్నారని మనందరికీ తెలిసిన విషయమే. మెగాస్టార్ ప్రజారాజ్యం పార్టీతో రాజకీయ ఆరంగేట్రం చేస్తే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తో ప్రజల్లోకి విచ్చేశారు. ప్రజారాజ్యం పార్టీ ఘోరంగా పరాజయం పొందడంతో చిరంజీవి మళ్లీ సినిమాల వైపు అడుగులు వేస్తున్నారు. జనసేన పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలలో ఘోరాతి ఘోరంగా పరాజయం చెందినా పవన్ కళ్యాణ్ ప్రజల సమస్యలపై ఇప్పటికీ పోరాడుతున్నాడు. తన సొంత డబ్బులతోనే పార్టీ నడపడం పవన్ కళ్యాణ్ కి పెద్ద సమస్యగా మారడంతో... మళ్లీ చిరంజీవి లాగానే సినిమాలు తీసేందుకు పవన్ కళ్యాణ్ ముందడుగు వేశాడు.


ఇప్పటికే మూడు సినిమాలకు ఒప్పుకున్న పవన్ కళ్యాణ్... మరో సినిమా కూడా తీసేందుకు సిద్ధమవుతున్నారని వార్తలు వెల్లువెత్తుతున్నాయి. పవన్ కళ్యాణ్ ఎలాగో నిజ జీవితంలో ముఖ్యమంత్రి కాలేదు కాబట్టి... కనీసం వెండితెర మీద నైనా తనని ముఖ్యమంత్రిగా చూపించాలని, అభిమానులను ఖుషీ చేయాలని చిరంజీవి భావిస్తున్నారట. అందుకే లూసిఫర్ సినిమా రీమేక్ లో పవన్ కళ్యాణ్ ని నటింప చేయాలని చూస్తున్నారు. ఒరిజినల్ లూసిఫర్ సినిమాలో సీఎం అయిన సచిన్ కెడ్కర్ మరణిస్తాడు. దాంతో తన వారసుడి పాత్రలో నటించిన టోవినో థామస్ తెరపైకి రాగా... అతడికి మోహన్ లాల్ రాజకీయ వ్యవహారం నేర్పించి సీఎం కుర్చీలో కూర్చోబెడతారు.


ఆ టోవినో థామస్ పోషించిన సీఎం పాత్రలో పవన్ కళ్యాణ్ ని నటింపజేయాలని చిరంజీవి భావిస్తున్నారు. అయితే ఈ పాత్ర దాదాపు 15నిమిషాల పాటు ఉంటుందని తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే చిరు ని, పవన్ ని ఓకే సారీ వెండితెరపై వీక్షించవచ్చు. ఇదే నిజమైతే అభిమానులకు అన్ని రకాలుగా ఈ చిత్రాన్ని ఎంజాయ్ చేస్తారని చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ సీఎం కుర్చీలో కూర్చొని వెండితెరపై కనిపిస్తే... అది తనకు రాజకీయంగా ప్లస్ అవుతుందని చిరంజీవి అభిప్రాయపడుతున్నారట. మరి చిరంజీవి ఆలోచన నిజం అవుతుందో లేదో చూడాలిక. 

మరింత సమాచారం తెలుసుకోండి: