మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో అతి ముఖ్యమైన సినిమాల లిస్టులో ముందువరుసలో నిలిచే సినిమా జగదేక వీరుడు అతిలోక సుందరి. చిరంజీవి ఇమేజ్, నటన, శ్రీదేవి నటన, అందం, దర్శకుడిగా రాఘవేంద్రరావు ప్రతిభ ఈ సినిమాను అత్యున్నత స్థానంలో నిలిపింది. తెలుగు సినిమాల్లో వచ్చిన అత్యభ్యుతమైన క్లాసిక్ మూవీస్ లో జగదేక వీరుడు అతిలోక సుందరికి కూడా స్థానం ఉంటుంది. ఈ సినిమా విడుదలై మరో రెండు రోజుల్లో 30 ఏళ్లు పూర్తి కాబోతున్నాయి. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాతో ఉన్న తన అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు.

 

 

‘సినిమా విజయం అనేది సమిష్టి కృషి అని నిరూపించేందుకు ఈ సినిమా ఓ నిదర్శం. ఈ సినిమాతో భాగమైన ప్రతి టెక్నీషియన్ కు ప్రత్యేక అభినందనలు. ఈ సినిమా విడుదలై 30 ఏళ్లు గడుస్తున్నా ఆ జ్ఞాపకాలు మధురమే. అద్భుతాల్ని ప్లాన్ చేయలేం. జరుగుతూంటాయి. అలా జరిగినప్పుడు అవి అద్భుతమైన జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి’ అని చిరంజీవి అన్నారు. ఈమేరకు తన ట్విట్టర్ అకౌంట్ లో చిన్న వీడియో రిలీజ్ చేశారు. మరిన్ని వివరాలు చెప్తానని కూడా మెగాస్టార్ హింట్ ఇచ్చారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ వాల్యూని ఆకాశమంత ఎత్తుకు చేర్చిన సినిమాగా జగదేకవీరుడు అతిలోక సుందరికి ఉంది.

 

 

1990 మే 9న విడుదలైన ఈ సినిమా గురించిన విశేషాలను హీరో నాని వాయిస్ ఓవర్ లో ఇప్పటికే అశ్వనీదత్ రివీల్ చేస్తున్నారు. నిర్మాతగా అశ్వనీదత్ నమ్మకం, ఇళయరాజా సంగీతం, జయనన్ విన్సెంట్ ఫోటోగ్రఫీ, ఆర్ట్ డిపార్ట్ మెంట్.. ఇలా ప్రతి ఒక్కరికి ఈ సినిమా విజయంలో భాగముంటుందనడంలో సందేహం లేదు. ఈ సినిమా విషయాలను ఈరోజు రెండో భాగంగా మరో మోషన్ వీడియోను హీరో నాని వాయిస్ ఓవర్ తో రానుంది.    

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: