దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి చాపకింద నీరులా విజృంభిస్తుంది. ఈ మహమ్మారిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ఒక్కటే సరైన పరిష్కారం అని తీసుకుని రావడం జరిగింది. ఇక ఈ లాక్ డౌన్ సమయంలో అన్ని రంగాలు మూతపడ్డాయి. దీనితో సామాన్య ప్రజలు, మధ్య తరగతి ప్రజలకు, రోజువారి కూలి చేసుకుని జీవనం కొనసాగించి వారికి ఆర్థిక సమస్యలు బాగా ఎదుర్కొన్నారు. ఇక వలస వచ్చిన కార్మికులు అయితే వాళ్ల స్థలానికి వెళ్లేందుకు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక వీరి కోసం కొంతమంది ప్రముఖులు ముందుకు వచ్చి వారికి సహాయం అందజేశారు. అదే తరుణంలోనే సినీ ప్రముఖులు కూడా తమకు తోచినంత సహాయం చేస్తూ వాళ్లకు అండగా నిలుస్తున్నారు.

 

 

ఇక తాజాగా కార్మికులకు అండగా ప్రముఖులు అందరు కూడా అండగా నిలుస్తూ... సహాయక చర్యలు మొదలు పెట్టారు అనే చెప్పాలి. కొన్ని రాష్ట్రాలలో అయితే వాళ్ళ సొంత ఊర్లకు కార్మికులను చేర్చేందుకు ఉచిత సౌకర్యాలు, రైలు సౌకర్యాలు కల్పించాయి ఆయా ప్రభుత్వాలు. దాదాపు లక్ష మంది కార్మికులు రోడ్డున పడ్డారని చెప్పాలి. అంతేకాకుండా వాళ్ళ జీవన ఉపాధి కోల్పోయి అనే కష్టాలు ఎదుర్కొంటున్నారు.

 

 

ఈ తరుణంలోనే తాజాగా బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ ఫిట్నెస్ టాటా సంస్థ వ్యవస్థాపకుడు రోహిత్ తో కలిసి ఆపదలో ఉన్న కార్మికులు అందరికీ అండగా నిలిచారు. దాదాపు 5 వేల మంది కూలీలకు ఇంటి అద్దెతో పాటు నిత్యావసర సరుకులు వారి పిల్లలకు భోజన సౌకర్యాలు సరిపడా డబ్బులను వారి బ్యాంకు ఖాతాలలో వేసే విధంగా సహాయం చేశారు. అంతేకాకుండా సౌత్ అనే కార్యక్రమం ద్వారా ఈ సహాయం చేస్తున్నట్లు బాలీవుడ్ హీరో తెలియజేశారు. టాలీవుడ్ లో కూడా మెగాస్టార్ చిరు కూడా సీసీసీ సంస్థను ఏర్పాటు చేసి సినీ వర్గానికి సంబంధించి సహాయం చేస్తున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: