విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనపై టాలీవుడ్ సెలబ్రిటీలు సోషల్ మీడియా ఖాతాల ద్వారా స్పందిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి విశాఖలో విషవాయువు భారీన పడి ప్రజలు మరణించడం మనసును కలచివేసిందని చెప్పారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అస్వస్థతకు గురైన వారంతా త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు. లాక్ డౌన్ తరువాత ఓపెన్ చేసే ఫ్యాక్టరీలలో సంబంధిత అధికారులు ఎటువంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. 
 
సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఘటనపై స్పందిస్తూ విశాఖ గ్యాస్ లీకేజీ ఘటన చాలా బాధాకరం అని చెప్పారు. ఈ ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు. స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి విశాఖ గ్యాస్ లీకేజీ గురించి తెలిసి షాక్ కు గురయ్యాయని తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. 
 
అస్వస్థతకు గురైన వారు త్వరలో కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నానని పేర్కొన్నారు. స్టార్ హీరోయిన్ తమన్నా ఈ ఘటన గురించి స్పందించారు. ఈరోజు గ్యాస్ లీక్ లాంటి భయంకరమైన వార్త విని మేల్కొన్నానని చెప్పారు. మృతి చెందిన వారికి సంతాపం తెలపడంతో పాటు బాధితులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు పేర్కొన్నారు. మరికొంతమంది టాలీవుడ్ ప్రముఖులు ఈ ఘటనపై స్పందిస్తున్నారు. 
 
ఈరోజు తెల్లవారుజామున మూడు గంటల సమయంలో విశాఖలోని వెంకటాపురం ఎల్. జీ పాలిమర్ ఫ్యాక్టరీలో మంటలు అంటుకోవడంతో విషవాయువులు లీక్ అయ్యాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు పది మంది మృతి చెందగా మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఘటనలో దాదాపు 2,000 మంది అస్వస్థతకు గురయ్యారని సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: