ప్రియమణి పేరు చెప్పగానే మనకి మొట్టమొదటిగా యమదొంగ సినిమా గుర్తొస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ సరసన చాలా చక్కని నటనా చాతుర్యాన్ని ప్రదర్శించిన ప్రియమణి కేవలం కొన్ని సంవత్సరాల వ్యవధిలోనే అగ్రతారగా ఎదిగింది. 2003లో ఎవరే అతగాడు సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన ప్రియమణి... అప్పట్లో ప్రేక్షకాదరణ అసలు పొందలేకపోయింది. తదనంతరం తమిళ ఇండస్ట్రీలో అడుగు పెట్టి అక్కడ తన అదృష్టాన్ని పరీక్షించుకోగా... అక్కడ కూడా ఆమె సినిమాలు విజయం సాధించలేదు.


దాంతో మళ్ళీ తిరిగి తెలుగు ఇండస్ట్రీకి వచ్చి జగపతిబాబు సరసన పెళ్లయిన కొత్తలో సినిమాలో నటించి సినీ ప్రేక్షకులను బాగా మెప్పించింది. ఈ చిత్రంలో చీర కట్టిన ఆమె జగపతి బాబు తో సెగలు పుట్టించే రొమాన్స్ చేసి యువతను బాగా చూరగొన్నది. ఈ సినిమా హిట్ తో ఆమెకు మరో మూడు సినిమాల్లో హీరోయిన్ ఛాన్సులు లభించాయి. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన యమదొంగ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సరసన కథానాయకి గా నటించిన ప్రియమణి కెరీర్ పీక్ స్టేజ్ కి వెళ్ళిపోయింది. ఈ చిత్రంలో తన నటనా చాతుర్యానికి అభిమానులతో పాటు సినీ విశ్లేషకులు కూడా ఫిదా అయిపోయారు.


ఈ చిత్రం తర్వాత ఆమెకు అనేకమైన ఆఫర్లు దన్నుకొచ్చాయి. కొన్ని సినిమాల్లో ఆమె తన స్కిన్ షో చేయడానికి కూడా ఎలాంటి నిర్మొహమాటం చూపించలేదు. బాలకృష్ణ హీరోగా నటించిన మిత్రుడు, రవితేజ సరసన శంభో శివ శంభో, సాధ్యం, గోలీమార్ రగడ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాల్లో ఆమె అద్భుతమైన నటనా ప్రతిభను చూపి అందరి ప్రశంసలను అందుకుంది. హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాల్లో కూడా ఆమె నటించింది కానీ అవేమీ అంతగా ప్రేక్షకాదరణ పొందలేదు. తెలుగు భాష ను మినహాయించి... ఆమె తమిళ కన్నడ మలయాళ చిత్రాల్లో కూడా నటించే అగ్రతారగా నిలిచింది. చెన్నై ఎక్స్ప్రెస్ సినిమాలో ఓ పాటలో కనిపించి అందరినీ ఎంతో అలరించింది. మలయాళంలో ఒక డాన్స్ షోకి న్యాయనిర్ణేతగా బాధ్యతలు నిర్వర్తించిన... ప్రస్తుతం ఈటీవీలో ప్రసారమవుతున్న ఢీ 10 డ్యాన్స్ షో కి జడ్జిగా వ్యవహరిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: