టాలీవుడ్ లో కొంత మంది సీనియర్ హీరోయిన్ లు ఇంకా వివాహం చేసుకోలేదు. ఇంకా సినిమాల్లో అవకాశాలు వస్తాయని అటు తమిళం ఇటు తెలుగులో తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కొంత మందికి వస్తున్నాయి అవకాశాలు మరికొంత మందికి రావడం లేదు. కాజల్ అనుష్క, త్రిష, నయనతార ఇప్పుడు అక్కడ ఇక్కడ కూడా అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ ముదురు హీరోయిన్లు ఏకంగా మూడున్న‌ర ప‌దుల వ‌య‌స్సు దాటేసినా కూడా ఇంకా సినిమాల్లో ఏదో ఒక ఛాన్స్ రాదా ? అని ఎదురు చూస్తూనే ఉన్నారు.

 

ఇదిలా ఉంటే ఇప్పుడు ఒక సీనియర్ హీరోయిన్ కి కుటుంబ సభ్యులు పెళ్లి సంబంధాలు చూసారట. అయినా సరే ఆమె పెళ్లి చేసుకోవడానికి ఆసక్తి చూపించలేదు అని సమాచారం. దానికి కారణం ఏంటీ అనేది తెలియదు గాని ఒక స్టార్ హీరోతో ఆమె ప్రేమలో ఉందని అందుకే పెళ్లి చేసుకోవడం లేదని అంటున్నారు. స‌ద‌రు ముదురు హీరోయిన్ ఆ స్టార్ హీరోను ప్రేమించ‌డం త‌ప్పు కాదు గాని... ఇక్క‌డే ట్విస్ట్ ఉంది. ఆ స్టార్ హీరోకి పెళ్లి కూడా అయ్యి.. పిల్ల‌లు కూడా ఉన్నారు. అయినా ఆమె మాత్రం అతని కోసం సింగిల్ గానే ఉంటుంది అని సమాచారం. 

 

పెళ్లి గురించి అమ్మా నాన్నా అడిగినా సరే ఆమె మాత్రం ఒప్పుకోవడం లేదని అంటున్నారు. తన మీద ఒత్తిడి తీసుకుని రావొద్దు అని తనకు నచ్చితే పెళ్లి చేసుకుంటా అని లేకపోతే లేదు అని ఆమె చెప్పినట్టు సమాచారం. తనకు ఇంకా సినిమాల మీద ప్రేమ ఉందని దయచేసి తనను ఏ కంగారు పెట్టకుండా ఉండాలని ఆమె విజ్ఞప్తి చేసింది అని అంటున్నారు. ఆమె ఇప్పుడు ఒక సినిమాలో నటించింది. ఆ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. ఇక స‌ద‌రు హీరో.. ఈ ముదురు హీరోయిన్ వ్య‌వ‌హారం ఎప్ప‌టి నుంచో ఇండ‌స్ట్రీ జ‌నాల‌కు బాగా తెలుసు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: