ప్రస్తుతం ప్రపంచంలో కరోనా వైరస్  నేపథ్యంలో అనేక రంగాలు దెబ్బతిన్నాయి అని చెప్పవచ్చు. సినీరంగం, వ్యాపార రంగం, రవాణా రంగం, క్రీడారంగం ఇలా చెప్పుకుంటూ వెళితే ప్రతి రంగంలోనూ ప్రగతి కుంటు పడిందని చెప్పవచ్చు. ఇక ఈ వైరస్ సినీ ఇండస్ట్రీలో పెను భూకంపం సృష్టించిన అని చెప్పవచ్చు.

 


కరోనా వైరస్ దెబ్బకు సినీ పరిశ్రమకి కొన్ని కోట్ల నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు ప్రముఖులు. ఇందులో కేవలం ఒక బాలీవుడ్ పరిశ్రమనే 2500 కోట్లు పైన నష్టపోయిందని ఫిలిం ట్రేడ్ అనలిస్ట్ కోమ‌ల్ న‌హ్తా తెలిపారు. ఈ లాక్ డౌన్ నేపథ్యంలో సినీపరిశ్రమలో జరగాల్సిన షూటింగ్ ప్రొడక్షన్ కార్యక్రమాలు అన్ని పూర్తిగా నిలిపివేశారు. ప్రస్తుతం బాలీవుడ్లో బడా సినిమాలైనా సూర్యవంశీ, కపిల్ దేవ్ బయోపిక్ లు కూడా వాయిదా పడ్డాయి. అసలు సినిమాలు ఎప్పుడు ఐపోతాయో, ఎప్పుడు రిలీజ్ చేస్తారో విషయంలో కూడా క్లారిటీ లేకుండా పోయింది.

 


మామూలుగా ఈ సమయంలో పాఠశాలలకు సెలవులు ఉండడంతోపాటు హాలీవుడ్ సినిమాల్లో పెద్దగా సినిమాలు రిలీజ్ కావు అని చెప్పవచ్చు. నిజానికి ప్రతి సంవత్సరం ఈ సమయంలో ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురుస్తుంది. అయితే ప్రస్తుతం ప్రపంచంలోని కరోనా వైరస్  నేపథ్యంలో బాలీవుడ్ పరిశ్రమ చాలా నష్టపోవాల్సి వచ్చిందని నిపుణులు తెలియజేస్తున్నారు. 

 

బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్, అక్షయ్ కుమార్, దీపికా పదుకునే వంటి పెద్ద పెద్ద స్టార్ సినిమాలు కూడా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాకపోవడంతో బాలీవుడ్ ఇండస్ట్రీకి పెద్ద దెబ్బ తగిలింది అని చెప్పవచ్చు. కేవలం బాలీవుడ్ పరిశ్రమలోనే కాకుండా మిగతా దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన ఇండస్ట్రీలో కూడా ఇలాంటి పరిస్థితి నెలకొని ఉంది. దీనితో అన్ని ఇండస్ట్రీలో వందల కోట్లలో నష్టం వాటిల్లిందని అనుకోవచ్చు. అంతే కాకుండా సినీ పర్వతానికి చెందిన అనేక మంది కార్మికులు ఈ లాక్ డౌన్ దృష్ట్యా అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: