ఒక వైపు ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్న సంగతి తెలిసిందే.. అయితే ఇప్పుడు ఆంధ్ర వాసులు మరో కోలుకోలేని దెబ్బ ఎదురైంది.. అదేంటంటే విశాఖ లోని గ్యాస్ లీక్.. పొద్దున్నే లేవగానే చావు కబురను మోస్తూ వచ్చింది. ప్రస్తుతం ఈ విషయం విశాఖను కదిలించి వేస్తుంది.. ప్రాణాంతకమైన కార్బన్ మోనో ఆక్సైడ్ విడుదల కావడంతో ప్రజలు ఊపిరి ఆడక చాలా మంది ప్రాణాలను విడిచారు.. 

 

 

 

 

 

విశాఖ లోని   ఆర్ఆర్ వెంకటాపురంలో ఉన్న ఎల్జీ పాలిమర్స్ కర్మాగారం నుంచి ప్రమాదకరమైన గ్యాస్ లీకై ఎనిమిదిమంది మరణించిన సంగతి తెలిసిందే. కరోనా మహమ్మారితో తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న ప్రజానీకాన్ని ఈ గ్యాస్ లీక్ ఘటన అతలాకుతలం చేసింది. ఆర్ఆర్ వెంకటాపురం ప్రాంతంలో కనిపిస్తున్న మనుషుల కళేబరాలు మనసును కదిలించి వేస్తుంది.. ఆ ఘటన చూసిన ఎవరికైనా కన్నీళ్లు రాక మానవు.. 

 

 

 

 

ఇప్పటికే ఈ విషయం పై స్పందించిన సినీ రాజకీయ ప్రముఖులు ప్రాగాడ సానుభూతిని తెలియజేశారు.. తాజాగా ఈ విషయం పై స్పందించిన జూనియర్ ఎన్టీఆర్ ట్విట్టర్ లో స్పందించారు. వైజాగ్ గ్యాస్ లీక్ వార్త తనను  తీవ్రంగా కలచివేసిందని తెలిపారు. ఈ ఘటనలో బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు ట్వీట్ లో పేర్కొన్నారు. ఈ కష్టకాలంలో వైజాగ్ నగర ప్రజలు మరింద దృఢంగా నిలవాల్సిన అవసరం ఉందని సూచించారు.

 

 

 

 

ఇకపోతే రామ్ చరణ్ ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వైజాగ్ లో దృశ్యాలు చూస్తుంటే గుండె పగిలినంత పనైందని వ్యాఖ్యానించారు. మృతుల కుటుంబాల పరిస్థితి పట్ల సానుభూతి వ్యక్తం చేశారు. బాధితులు త్వరగా కోలుకునేందుకు తగిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. చనిపోయిన   వారందరి ఆత్మ శాంతి చేకూరాలని వారు కోరుకుంటున్నారు.. చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని, హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని ఇండియా హెరాల్డ్ కోరుకుంటుంది.. 

మరింత సమాచారం తెలుసుకోండి: