ప్రస్తుతం బాలీవుడ్ ప్రముఖుల్లో కరణ్ జోహార్ పేరు కూడా ఉంటుంది. భారీ సినిమాల నిర్మాతగా, పంపిణీదారుడిగా కరణ్ పేరు దేశంలో మోగిపోతూ ఉంటుంది. బాహుబలి సిరీస్ సినిమాలను హిందీలో రిలీజ్ చేశాడు. ఆ సినిమాతో భారీ లాభాల్ని కూడా దక్కించుకున్నాడు. కరణ్ జోహార్ ఓ ప్రాజెక్టును టేకప్ చేస్తే అందరిలో చర్చనీయాంశమవుతుంది. అంతగా ఆయన ఎదిగిపోయాడు. ప్రస్తుత లాక్ డౌన్ పరిస్థితుల్లో ఇంటికే పరిమితమైన కరణ్ చేసిన ఓ ఇన్ స్టా పోస్ట్, దానికి ఇచ్చిన స్టేట్ మెంట్ ఇప్పుడు ఫన్నీగా మారింది.

 

 

రీసెంట్ లుక్ లో ఉన్న కరణ్ జోహార్ ఓ సెల్ఫీ తీసుకుని తన ఇన్ స్టా అకౌంట్ లో పోస్ట్ చేశాడు. ఆ ఫొటోలో కరణ్ తెల్ల జుట్టుతో ఉన్నాడు. దీంతో తాను తండ్రి పాత్రలకు సిద్ధంగా ఉన్నానంటూ ఓ ఫన్నీ క్యాప్షన్ ఇచ్చాడు. ‘లాక్ డౌన్ పరిస్థితుల్లో ఇంట్లోనే ఉండిపోయాను. హెయిర్ కటింగ్ చేయించుకునే వీలు లేకుండా పోయింది. సెలూన్ కి వెళ్లలేకపోవడంతో జుట్టంతా తెల్లబడిపోయింది. కాబట్టి దర్శక నిర్మతలు ఎవరైనా నాకు తండ్రి పాత్రలు చేసే అవకాశం ఇవ్వండి. 48ఏళ్ల వయసులోనే తండ్రినైపోతాను. కాకపోతే నా ట్రాక్ రికార్డు అంత బాగుండదు. అయినా రెడీగా ఉన్నాను’ అంటూ పోస్ట్ చేశాడు.

 

 

ఈ ఫొటోకు నెటిజన్ల నుంచే కాకుండా సినీ సెలబ్రిటీల నుంచి పెద్ద ఎత్తున కామెంట్లు వస్తున్నాయి. ఫరాఖాన్.. ‘టాప్ హీరోయిన్ ఖర్చు కంటే నీ ఖర్చే ఎక్కువ’, కృతి సనన్.. ‘కరెక్ట్ గా ఫిట్ అయ్యారుగా’, సోనూ సూద్ ‘మీరే క్రియేటర్స్.. మొత్తానికి బాలీవుడ్ఫ్యాషన్ ఫాదర్ ని పట్టేసింది’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. దిల్ వాలే దుల్హనియా లేజాయేంగేలో షారుఖ్ ఫ్రెండ్ గా నటించాడు. కుచ్ కుచ్ హోతాహై సినిమాను డైరక్ట్ చేశాడు కరణ్.

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: