తమిళ హీరోలకు ఇప్పుడు మన తెలుగులో మంచి డిమాండ్ వచ్చింది. చిన్న హీరోల సినిమాల నుంచి పెద్ద హీరోల సినిమాల వరకు అన్నీ కూడా ఇప్పుడు తమిళ హీరోల మీద దృష్టి పెడుతున్నాయి. కథలో నటనకు ప్రాధాన్యత ఉండే హీరోల సినిమాల్లో అలాగే కమర్షియల్ సినిమాల్లో కూడా నటించడానికి ఇప్పుడు తమిళ హీరోలు కూడా ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. చిన్న హీరోల సినిమాల్లోనే కాదు పెద్ద హీరోల సినిమాల్లో కూడా విలన్లు గా నటించే ప్రయత్నాలు చేస్తున్నారు తమిళ స్టార్ హీరోలు. టాలీవుడ్ లో ఇప్పుడు వారికి మంచి డిమాండ్ ఉంది. 

 

అలాగే వారికి పారితోషికం కూడా భారీగా ఇవ్వడానికి దర్శక నిర్మాతలు ఎదురు చూస్తున్నారు. తమిళంలో మంచి ఆదరణ ఉన్న హీరోలను తమ సినిమాలోకి తీసుకోవడానికి హీరోలు కూడా ఎదురు చూస్తున్నారు అనే ప్రచారం జరుగుతుంది. విజయ్ సేతుపతికి మన తెలుగులో మంచి డిమాండ్ ఉంది. ఆయన సినిమాలకు ఇక్కడ కూడా ఆదరణ ఉంది అనే సంగతి తెలిసిందే. చిన్న చిన్న సినిమాలకు కూడా ఆయనను తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో అతను మూడు సినిమాలు చేస్తున్నాడు. 

 

ఇప్పుడు ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమాలో విలన్ గా కూడా ఆయన నటించే అవకాశం ఉందని సమాచారం. దీనిపై స్పష్టత లేదు గాని త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉందని టాలీవుడ్ జనాలు అంటున్నారు. ప్రస్తుతం విజయ్ చాలా వరకు బిజీ గా ఉంటున్నాడు. అతనికి పుష్పా సినిమాలో ఆఫర్ వచ్చినా సరే చేయలేదు. దానికి కారణం అగ్ర హీరో సినిమాలో భారీ ఆఫర్ రావడమే అని అలాగే తమిళంలో కూడా బిజీ గా ఉండటమే అని అంటున్నారు. ప్రస్తుతం విజయ్ ఊపిరి అనే సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత స్టార్ హీరో సినిమాలో చేస్తాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: